📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Pooja Hegde: జన నాయగన్ ,విజయ్ చివరిచిత్రం అవ్వడం బాధగా ఉందన్న పూజా హెగ్డే

Author Icon By Anusha
Updated: June 8, 2025 • 3:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే వరుసగా సినిమాలు చేస్తున్న అంతగా అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తదితర తెలుగు స్టార్ నటులందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ కాలం గిర్రున తిరిగింది. గత మూడు సంవత్సరాలుగా పూజా హెగ్డే(Pooja Hegde) ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. వరుసగా హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ఆ నటి ఇప్పుడు చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు, ఇటీవలే సూర్య హీరోగా నటించిన రెట్రో సినిమాలో హీరోయిన్ గా చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో పేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.

జననాయగన్ సినిమా

పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన రాధేశ్యామ్‌, బీస్ట్, ఆచార్య, సిర్కస్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్, దేవా రీసెంట్ గా వచ్చిన రెట్రో ఇలా వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి. వరుసగా ఏడు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఈ అమ్మడికి వరుసగా ఛాన్స్ లు వస్తున్నాయి. ప్రస్తుతం దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న జననాయగన్ సినిమా(Jananayagan Movie)లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతుంది. ఈ సినిమాను పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. తాజాగా పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

నేను సాధించాల్సింది

ఇటీవల కాలంలో నేను నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరుస్తున్నాయి. కొన్నాళ్లుగా నా లైఫ్ లో విజయం అనే పదానికి అర్ధం మారిపోయింది. కానీ నాకు ఈ టైం చాలా ఇంపార్టెంట్ భవిష్యత్తులో నేను చేసే సినిమాలు నేను ఎలాంటి నటిని అనేది ప్రేక్షకులకు చూపిస్తాయని అనుకుంటున్నా,నాలాంటి వాళ్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు.వారు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నా కానీ నేను సాధించాల్సింది చాలా ఉంది.అందరి జీవితంలో హెచ్చుతగ్గులు ఖచ్చితంగా ఉంటాయి. మేము నటులం ఫ్లాప్ లను కూడా స్వీకరించాలి. బీస్ట్‌ సినిమా(Beast movie) తర్వాత ఇప్పుడు జన నాయగన్ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. కానీ ఇది విజయ్ చివరిచిత్రం అవ్వడం ఒకింత బాధగా అనిపిస్తుంది. నా దృష్టిలో ఇదొక చేదు వార్త. ఎందుకంటే నాతో పాటు చాలా మంది అభిమానులు విజయ్‌ సినిమాల్ని ఇష్టపడతారు. ఒకప్పుడు ఆయన సినిమాల కోసం ఎదురుచూసేవాళ్ళం అంటూ చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

Read Also: Jamie Lever: నా బాల్యం ఒక పీడకల..జానీ లివర్ కుమార్తె

#BeastToJanaNayagan #CareerUpsAndDowns #PoojaSpeaksOut #VijayFinalFilmFeels Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.