📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

Pendulum Movie: ‘పెండ్యులం’ (ఈటీవీ విన్) మూవీ రివ్యూ

Author Icon By Anusha
Updated: May 22, 2025 • 4:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో మలయాళంలో రూపొందిన సినిమానే ‘పెండ్యులం’. లూసిడ్ డ్రీమింగ్ – టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాకి రెజీనా బాబు దర్శకత్వం వహించాడు. విజయ్ బాబు – అనుమోల్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా,  జూన్ 16వ తేదీన 2023లో విడుదలైంది. ఈ సినిమా ఇప్పుడు ఈటీవీ విన్ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఒకసారి చూద్దాం. 

కథఏంటంటే

మహేశ్ నారాయణన్ ( విజయ్ బాబు) ఆయన భార్య శ్వేత, కూతురు తన్మయి కలిసి ఆస్ట్రేలియా నుంచి ఇండియా వచ్చేస్తారు. మహేశ్ డాక్టర్ కావడంతో, అతను హాస్పిటల్ కి వెళ్లి వస్తూ ఉంటాడు. ఒక రోజున అతను భార్యా పిల్లలతో కలిసి సరదాగా లాంగ్ డ్రైవ్ కి వెళతాడు. ఒక ప్రదేశానికి వెళ్లిన తరువాత, గతంలో ఆ ప్రదేశంతో తనకి సంబంధం ఉన్నట్టుగా మహేశ్(Mahesh) కి అనిపిస్తుంది. దాంతో అతను గుర్తుచేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తన్మయి చేసిన పొరపాటు కారణంగా డిక్కీలో కార్ కేస్ ఉండిపోవడంతో, ఆ రాత్రి వాళ్లంతా అక్కడే ఉండిపోవలసి వస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే మహేశ్ రోడ్డుపక్కన పొదల్లో స్పృహలేకుండా పడిఉంటాడు. రాత్రి తనని ఓ లారీ ఢీ కొట్టిందని శ్వేతతో మహేశ్ చెబుతాడు. ఆ మాటలను ఆమె నమ్మలేకపోతుంది. ఆ లారీ నెంబర్ కూడా తాను చూశానని మహేశ్ చెబుతాడు. ఆ తరువాత విచారణ చేస్తే, 15 ఏళ్ల క్రితమే ఆ లారీని డిస్పోజ్ చేశారని తెలిసి షాక్ అవుతాడు.కొన్ని ప్రదేశాలు ఇంతకుముందే చూసినట్టుగా ఎందుకు అనిపిస్తున్నాయి? 15 ఏళ్ల క్రితమే డిస్పోజ్(Dispose) చేయబడిన లారీ, తనని ఎలా ఢీకొట్టింది? అనే విషయం మహేశ్ కి అర్థం కాదు. ఇలాంటి విషయంలో మంచి అనుభవం ఉన్న జాన్ మాస్టర్ ను కలుస్తాడు. వేరేవారి కలలోకి అతను వెళ్లడం వలన ఈ సమస్య తలెత్తిందని జాన్ మాస్టర్ చెబుతాడు. ఆ కల కన్నది ఎవరనే విషయం తెలిస్తే పరిష్కారం లభిస్తుందని చెబుతాడు. అప్పుడు మహేశ్ ఏం చేస్తాడు? ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటాడు? అనేది కథ. 

Pendulum Movie: ‘పెండ్యులం’ (ఈటీవీ విన్) మూవీ రివ్యూ

కథనం

కలలు కనని వాళ్లంటూ ఉండరు. ఎవరికి వచ్చిన కలలో వారు అనేక ప్రదేశాలను దృశ్యాలను చూస్తూ ఉంటారు. ఒక్కోసారి మనకి తెలియకుండానే మనం అవతలివారి కలలోకి వెళ్లినప్పుడు వాళ్ల కలకు భంగం కలుగుతుంది. ఫలితంగా వారి జీవితాలు ప్రభావితమవుతూ ఉంటాయనే ఒక లైన్ పై ఈ కథ నడుస్తూ ఉంటుంది. ఇష్టమైన వారిని కలలోకి ఆహ్వానించడం, ఇష్టపడిన వారి కలలోకి వెళ్లడం సాధ్యమే అనే ఒక కాన్సెప్ట్ తో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ ఇది. అలా వెళ్లడం వలన తలెత్తిన ఒక చిన్న ఇబ్బంది చుట్టూ ఇంట్రెస్టింగ్ గా ఈ కథను నడిపించారు. సమయం – కాలం అనే రెండు అంశాలను అల్లుకుంటూ ఈ కథ కొనసాగుతుంది.

Read Also : Ram Charan : రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్!

#MalayalamCinema #MysteryThriller #Pendulum Movie review #PendulumMovie #TimeTravelMovie Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.