టాలీవుడ్ లో సీనియర్ హీరోలు నుంచి కుర్రహీరోలు వరకు సినిమాలో వారి పాత్ర కోసం బరువు పెరగడం, తగ్గడం సిక్స్ ప్యాక్ లు చేయడం వంటివి చేస్తూనే ఉంటున్నారు. గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ కోవలోకే వస్తారు. ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.ఎన్టీఆర్ సినీ కెరీర్ మొదట్లో లావుగా ఉండేవారు. రాఖీ సినిమాలో బాగా లావుగా కనిపిస్తారు. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళితో చేసిన యమదొంగ సినిమా కోసం సన్నగా మారారు. ఇక అప్పటి నుంచి బాడీని మెయింటైన్ చేస్తూ అలరిస్తూ వస్తున్నారు. ఇక టెంపర్, అరవింద సమేత వీర రాఘవ చిత్రాల్లో తారక్ సిక్స్ ప్యాక్ లో కనిపించాడు. రీసెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దేవరా సినిమాలో సైతం తండ్రి పాత్ర కోసం కొంచెం లావుగా, కొడుకు పాత్ర కోసం కొంచెం సన్నగా కనిపించారు.
సినిమా కోసం
ఈ సినిమాలో ఎన్టీఆర్ చూడడానికి కొంచెం లావుగా కనిపిస్తాడు. ఒక ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం తారక్ చాలా కష్టపడ్డారు. అయితే ఎన్టీఆర్ ఇటీవల కొంతకాలంగా బక్కచిక్కి కనిపిస్తున్నారు. మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్‌లో, కళ్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సన్నగా కనిపించారు ఎన్టీఆర్. దీంతో మా హీరోకి ఏమైంది అంటూ ఆయన అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. అయితే ఎన్టీఆర్ సడన్ గా బాగా సన్నబడడానికి కారణం ప్రశాంత్ నీల్ సినిమా కోసమే అని రీసెంట్ గా కళ్యాణ్ రామ్ చెప్పడంతో అభిమానులు అంతా కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
సోషల్ మీడియా
దాదాపు ఐదు నెలల్లోనే ఎన్టీఆర్ సుమారుగా 18 కేజీల బరువు తగ్గారని అంటున్నారు. రోజుకు మూడు గంటల పాటు వర్కౌట్ చేసి, ఫ్యాట్ ఎంకరేజ్ చేయకుండా హై ప్రోటీన్స్ తో ఎన్టీఆర్ డైట్ ను పాటించారని చెబుతున్నారు. దీంతో ఎన్టీఆర్ బాగా బరువు తగ్గి పోయారని తెలిపారు. ఈ క్రమంలోనే సినిమా కోసం నీ డెడికేషన్ సూపర్ అన్నా అంటూ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెగ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు రీసెంట్ గానే నీల్ – ఎన్టీఆర్ సినిమా తొలి షెడ్యూల్‌ని హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభించారు. ఇక నేటి నుంచి సెకండ్ షెడ్యూల్ జరగనుండగా షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొంటారని మూవీ యూనిట్ అప్డేట్ ఇచ్చింది.
Read Also: OTT: ఓటీటీలోకి ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ ఎప్పుడంటే!