📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

OTT: (నెట్ ఫ్లిక్స్)’గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ రివ్యూ

Author Icon By Anusha
Updated: May 8, 2025 • 4:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళ స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగారూపొందిన సినిమా’గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, యాక్షన్ కామెడీ జోనర్లో ప్రేక్షకులను పలకరించింది. త్రిష కథానాయికగా నటించిన ఈ సినిమా, ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, ఈ రోజు నుంచే ‘నెట్ ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ

అజిత్ కుమార్( ఏకే ) ఒక గ్యాంగ్ స్టర్. అందరూ కూడా అతణ్ణి ‘రెడ్ డ్రాగన్’ అని పిలుస్తూ ఉంటారు. ఇతర దేశాలకు చెందిన గ్యాంగ్ స్టర్స్ కి సైతం అతనంటే భయం. అలాంటి అతను రమ్య (త్రిష) ప్రేమలో పడతాడు ,రమ్యను పెళ్లి చేసుకుంటాడు. వాళ్లిద్దరికీ ఒక బాబు పుడతాడు. అయితే తన బిడ్డను తాకాలంటే, మాఫియాను వదిలేయవలసి ఉంటుందని రమ్య తేల్చి చెబుతుంది. ఆమె మాటకు కట్టుబడి అతను 16 ఏళ్లు జైలు శిక్షను అనుభవిస్తాడు. ఏకే తనయుడు విహాన్ ( కార్తికేయన్)టీనేజ్ లోకి అడుగుపెడతాడు. అతని తండ్రి ఓ గ్యాంగ్ స్టర్ అనే విషయం విహాన్ కి తెలియకుండా రమ్య జాగ్రత్తపడుతుంది. విదేశాలలో అతను పెద్ద బిజినెస్ మేన్ అని చెప్పుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే జైలు నుంచి ఏకే విడుదలవుతాడు. తన తండ్రిని కలుసుకోవడానికి విహాన్ (కార్తికేయ) ఆరాటపడుతూ ఉంటాడు. తన బర్త్ డేను తండ్రితో కలిసి జరుపుకోవాలని అతను ఆశపడుతూ ఉంటాడు.కొడుకును కలుసుకోవడానికి ఎంతో ఆత్రుతగా ఏకే బయల్దేరతాడు. అయితే ఏకే(Ajith Kumar) జైలు నుంచి బయటికి వచ్చాడనే విషయం శత్రువులకు తెలిసిపోతుంది. వాళ్లంతా మార్గమధ్యంలోనే అతనిని అడ్డగిస్తారు. తీరా విహాన్ దగ్గరికి వెళ్లేసరికి ‘డ్రగ్స్’ కేసులో పోలీసులు అతనిని అరెస్టు చేసి జైలుకు తీసుకుని వెళతారు. అతనిని ఆ కేసులో ఇరికించినదెవరో తెలుసుకోవాలని ఏకే నిర్ణయించుకుంటాడు. బర్త్ డే లోగా అతన్ని జైలు నుంచి బయటికి తీసుకొస్తానని ప్రామిస్ చేస్తాడు.అందుకోసం అతను ఏం చేస్తాడు? అతని కొడుకును ఆ కేసులో ఇరికించింది ఎవరు? కొడుక్కి ఇచ్చిన మాటను ఏకే నిలబెట్టుకుంటాడా? అనేది కథ. 

Good Bad Ugly(Net Flix) Movie Review

కథనం

తన భార్య బిడ్డలతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకున్న ఏకే, మాఫియాను పక్కన పెట్టేసి ఆయుధాలు వదిలేస్తాడు. అదే ఫ్యామిలీని రక్షించుకోవడం కోసం తిరిగి అతను ఆయుధాలు చేతపట్టడమే ఈ సినిమా కథ. హీరోగా అజిత్ హీరోయిన్ గా త్రిష ప్రతినాయకుడిగా అర్జున్ దాస్(Arjun Das) ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు. ఇక హీరో ఫ్రెండ్స్ గా సునీల్ – ప్రసన్న, హీరో కొడుకుగా కార్తికేయన్ ముఖ్యమైన పాత్రలలో కనిపిస్తారు.ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు,నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడలేదు అనే విషయం మనకి తెరపై అర్థమైపోతూనే ఉంటుంది. దర్శకుడు యాక్షన్ కి ఎమోషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వెళ్లాడు. తుపాకుల కాల్పులుబాంబ్ బ్లాస్టింగ్స్ఛేజింగులతో దర్శకుడు హోరెత్తించాడు. మాస్ ఆడియన్స్ ముందు మందుపాత్రలాంటి కంటెంట్ ను ఉంచాడు. వసూళ్ల సంగతి అలా ఉంచితే, ఈ సినిమా చూస్తుంటే మనలను ఒక డౌట్ వెంటాడుతూ ఉంటుంది. అజిత్ ఈ కథ విన్నాడా అనేదే ఆ డౌట్. 

Read Also :Allu Arjun: ఆపరేషన్ సింధూర్‌పై అల్లు అర్జున్ ట్వీట్..అభిమానులు ఏమంటున్నారంటే?

#LatestRelease #MaitriMovieMakers #MustWatch #NetflixIndia #NowStreaming #TeluguCinema Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.