Netflix: ‘ధురంధర్’ ను తెలుగులో కూడా చూడొచ్చు

Read Time:  1 min
Netflix: ‘ధురంధర్’ ను తెలుగులో కూడా చూడొచ్చు
FONT SIZE
GET APP

పెద్దగా అంచనాలు లేకుండానే థియేటర్లలో విడుదలై బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ధురంధర్’ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను పలకరించింది. థియేటర్లలో అంచనాలకు మించిన విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా, తాజాగా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.ఇవాళ్టి నుంచి హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ లాంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటించారు.

Read Also: Pawan Kalyan: విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం

సారా అర్జున్ హీరోయిన్‌

ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా వహించడం విశేషం. విడుదలైనప్పటి నుంచి అంచనాలను మించి వసూళ్లు రాబట్టిన ‘ధురందర్’ ప్రపంచవ్యాప్తంగా రూ.1350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది.ఆదిత్య ధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. విడుదలై రెండు నెలలు దాటినా కొన్ని థియేటర్లలో ఇంకా ప్రదర్శితమవుతుండటం ఈ సినిమాకు ఉన్న ఆదరణకు నిదర్శనం. ఈ చిత్రంతో సారా అర్జున్ బాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.