📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Actor: పాన్ ఇండియా సినిమాలపై నాగార్జున కామెంట్స్

Author Icon By Anusha
Updated: May 3, 2025 • 11:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘వరల్డ్‌ ఆడియో విజువల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌ (వేవ్స్‌)’ గురువారం ముంబైలో అట్టహాసంగా ప్రారంభమైంది. పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ సదస్సులో సందడి చేసారు. ఇందులో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, అమల, నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మొదటి రోజు హోస్టుగా కార్యక్రమాన్ని నడిపించిన నాగ్.. రెండో రోజు శుక్రవారం సమ్మిట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ స్టాల్‌’ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.వేవ్స్ సమ్మిట్ లో తమిళ హీరో కార్తి, సీనియర్ నటి ఖుష్బూ, బాలీవుడ్ నటుడు అనుపమ్‌ ఖేర్‌లతో కలిసి ‘పాన్‌ ఇండియా సినిమా’పై కింగ్ నాగార్జున మాట్లాడారు. ”పుష్ప సినిమాలు రెండూ తెలుగు కంటే వేరే భాషల్లో ఎక్కువ వసూళ్లు రాబట్టాయి. ప్రత్యేకంగా ఉత్తరాది భాషల్లో బాగా కలెక్ట్ చేసాయి. తెలుగు ఆడియన్స్ పుష్ప లాంటి సినిమాలు ఇంతకముందే చూసేసారు. మాకు అవి కొత్త కాదు. పుష్పరాజ్ లాంటి క్యారెక్టర్స్, లార్జర్ దేన్‌ లైఫ్ సినిమాలు మేం చూసేశాం. బీహార్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు తమ హీరోలను అలాంటి పాత్రల్లో చూడాలని అనుకుంటున్నారు. ‘పుష్ప’లో పుష్పరాజ్, ‘కేజీయఫ్‌’లో రాకీ, బాహుబలి ఇలాంటి లార్జర్ దేన్‌ లైఫ్ రోల్స్ లో హీరోలని చూడాలని కోరుకుంటున్నారు” అని నాగ్ అన్నారు.

స్క్రీన్

ఈరోజుల్లో ప్రతీ ఒక్కరూ చాలా ఒత్తిడితో జీవిస్తున్నారు. 100లో 90 – 95 శాతం మంది తమ స్ట్రెస్ ని పోగొట్టుకునేందుకు స్క్రీన్ మీద జరిగే మ్యాజిక్‌ చూసేందుకు ఇష్టపడుతుంటారు. బేసిక్ ఇండియన్ కల్చరల్ స్టోరీతో రూపొందించే లార్జర్ దెన్ లైఫ్ సినిమాలను ఆదరిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన సినిమాలన్నీ ఆ విధంగానే సక్సెస్ అయ్యాయి. సూపర్ మ్యాన్ మార్వెల్ ఫిలిమ్స్ లో హీరోలకు కొన్ని సూపర్ పవర్స్ ఉంటాయి. కానీ మనకు అలాంటి స్పెషల్ పవర్స్ అవసరం లేదు.”సాధారణ ప్రేక్షకులు పుష్పరాజ్‌, రాకీ, బాహుబలి లాంటి సినిమాలు చూడాలనుకుంటున్నారు.ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి హీరోలను స్క్రీన్ మీద చూసినప్పుడు నేను క్లాప్స్ కొడతా. రాజమౌళి ‘బాహుబలి’ని ఫ్రేమ్ టూ ఫ్రేమ్ తెలుగు సినిమా అనే తెరకెక్కించాడు. కానీ జపాన్, చైనా ఇలా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆదరించారు. మనం మన కల్చర్, మన భాష పట్ల ప్రౌడ్ గా ఉంటే మన ఆలోచనలే పాన్ వరల్డ్ స్థాయికి వెళ్తాయి” అని నాగార్జున చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం నాగార్జున చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. చివరిసారిగా నా సామిరంగ చిత్రంలో కనిపించిన నాగ్ ఇప్పుడు కుబేర, థగ్ లైఫ్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలు అడియన్స్ ముందుకు రానున్నాయి.

Read Also: Simbu: తాను షూటింగ్‌లకు లేటుగా రావడంపై శింబు కామెంట్

#AudienceFavorite #BlockbusterVibes #PanIndiaFilms #PowerfulHeroes #PushpaRaj #RockyBhai Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.