సినిమా సినీ సెలబ్రెటీల పిల్లలంటే ఎలాంటి బాధలు లేకుండా లగ్జరీ లైఫ్ అనుభవిస్తారని చాలామంది అనుకుంటారని, కానీ తన విషయంలో మాత్రం అలా జరగలేదని అంటోంది హీరోయిన్ శ్రుతిహాసన్. విశ్వ నటుడు కమల్‌హాసన్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె నటిగానే కాకుండా సింగర్, మ్యూజిక్ డైరెక్టర్‌గా మల్టీ టాలెంటెడ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయలు, ఇండస్ట్రీకి రాకముందు జరిగిన విషయాల గురించి షేర్ చేసుకుంది. తాను సినిమా కుటుంబం నుంచి వచ్చినా ఎప్పుడూ దాన్ని దృష్టిలో పెట్టుకోలేదని శ్రుతీహాసన్ చెబుతోంది.
రెండు రకాల
అమ్మా నాన్న విడిపోవడం నా జీవితంలో బాగా బాధపెట్టిన సంఘటన. వారి విడాకుల తర్వాత నేను అమ్మ సారికతో కలిసి ముంబయికి షిఫ్ట్ అయిపోయా. దీంతో నా జీవితం ఒక్కసారిగా మారిపోయింది. విలాసవంతమైన ఇంటి నుంచి చిన్న ఇంటికి మారిపోయాం. బెంజ్ కారులో తిరిగినదాన్ని లోకల్ ట్రైన్లో ప్రయాణించడం అలవాటు చేసుకున్నారు. చాలా తక్కువ రోజుల్లోనే రెండు రకాల జీవితాలను చూశాను. జీవితం ఎంత త్వరగా రంగులు మారుతుందో అప్పుడే తెలిసింది. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందు. సంగీతం నేర్చుకోవడానికి విదేశాలకు వెళ్లాను. అప్పుడే నా డబ్బు నేను సంపాదించుకోవాలి, స్వతహాగా ఉండాలని నిర్ణయించుకున్నారు. స్వదేశానికి తిరిగొచ్చాక ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరిగాను. సినీ పరిశ్రమలోకి వచ్చిన తర్వాతే నాన్నతో క్లోజ్‌గా ఉంటున్నాను’ అని చెప్పుకొచ్చింది . శ్రుతి హాసన్ చెప్పిన ఈ విషయాలు ఆమె అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తున్నాయి.
జీవితం
కమల్ హాసన్ ,సారికా మొదటిసారి 1984లో రాజ్ తిలక్ షూటింగ్ సమయంలో కలుసుకున్నారు. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారి 1988లో వివాహం చేసుకున్నారు. వీరికి శ్రుతిహాసన్, అక్షర హాసన్ అనే కుమార్తెలు పుట్టారు. 16ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2004లో వీరు విడాకులు తీసుకున్నారు. శ్రుతిహాసన్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న ‘కూలీ’ మూవీలో కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘డ్రాగన్’లో ఐటెమ్ సాంగ్ చేయనున్నుట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.శ్రుతి హాసన్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ హీరోయిన్. ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటూ హిట్స్ అందుకుంటుంది. అంతే కాదు పాన్ ఇండియా సినిమాల్లోనూ ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్య శ్రుతిహాసన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్స్ గా నిలుస్తున్నాయి. సలార్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన శ్రుతి హాసన్.
Read Also: Simran: డబ్బా ఆంటీ రోల్స్ కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చిన సిమ్రాన్