📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Actress: అప్పట్లో నా ఎత్తే నాకు అతిపెద్ద సమస్య : మీనాక్షి చౌదరి

Author Icon By Anusha
Updated: April 29, 2025 • 11:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్ లో ఇప్పుడు ఈ అమ్మడు పేరు తెగ మారుమ్రోగుతోంది. వరుస హిట్స్ తో దూకుపోతోంది ఈ చిన్నది. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ రాణిస్తుంది ఈ అమ్మడు.తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరోయిన్ లో మీనాక్షి చౌదరి ఒకరు. 2017లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో మిస్ ఐఎంఏ అవార్డు గెలుచుకుంది ఈ అందాల భామ. 2019లో హిందీ చిత్రం అప్‌స్టార్ట్స్ తో సినీ రంగంలోకి అడుగుపెట్టింది.టాలీవుడ్‌లో ఇప్పుడు బాగా వినిపిస్తోన్న పేరు మీనాక్షి చౌదరి. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి ఆ వెంటనే మాస్ మహరాజ్ రవితేజ సరసన ‘ఖిలాడీ’లో ఛాన్స్ కొట్టేసింది. అయితే ఆ సినిమా ప్లాఫ్ అయింది. ఆ తర్వాత అడివి శేష్ సరసన ‘హిట్ 2’లో నటించి తొలి హిట్ అందుకుంది. ‘గుంటూరు కారం’లో మహేశ్‌బాబు మరదలిగా చిన్న పాత్రలో కనిపించింది. 2024లో లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాఖీ చిత్రాల్లో నటించింది. ఇందులో ‘లక్కీ భాస్కర్’ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. 2025లో అయితే మీనాక్షి జాతకమే మారిపోయింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సంక్రాంతికి రిలీజై బ్లాక‌బస్టర్ అయింది. ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్లతో నిర్మాతల కు కాసుల వర్షం కురిపించింది. ఇందులో వెంకటేష్ ప్రియురాలిగా మీనాక్షి చౌదరి మెప్పించింది. ఈ సినిమాతో అమ్మడి గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. వరుస ఆఫర్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లేందుకు తెగ కష్టపడుతోంది. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో నటిస్తోంది.

సమస్య

తాజాగా మీనాక్షి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.‘కాలేజీ రోజుల్లో చాలామంది నాతో డిస్టెన్స్‌ మెయింటైన్‌ చేసేవారు. ప్రత్యేకంగా చూసేవారు. దాంతో నేను కూడా ఇతరులతో ఫ్రీగా ఉండలేకపోయేదాన్ని.మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడేదాన్ని. దానికి బలమైన కారణం ఉంది. అదేంటంటే, నిజానికి అప్పట్లో నా హైట్ నాకు అతిపెద్ద స‌మ‌స్య. అప్పట్లో నాకు చాలా బాధగా కూడా అనిపించేది. ఇదే విషయాన్నీ ఆర్మీ ఆఫీసర్‌ అయిన మా నాన్నకు  చెప్పాను. దానికి ఆయన నీ సమస్యను నువ్వే పరీక్షించుకో అని సలహా ఇచ్చారు. దీంతో నేను నా కెరీర్ మార్చుకున్నా అందాల పోటీల్లో పాల్గొన్నాను. ఇండ‌స్ట్రీకి వచ్చాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఆఫ‌ర్ స‌ద్వినియోగం చేసుకున్నాను అని మీనాక్షి చౌదరి చెప్పుకొచ్చింది. ఈకామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Read Also :Jewel Thief : ‘జువెల్ తీఫ్’ మూవీ రివ్యూ!

#6Foot2 #GrowingPains #HeightProblems #SelfConfidenceJourney #TallGirlStruggles #TeenLife Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.