📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Mukul Dev: బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ కన్నుమూత

Author Icon By Ramya
Updated: May 24, 2025 • 1:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలీవుడ్‌లో విషాదం : ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ కన్నుమూత

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ విలన్ ముకుల్ దేవ్ అనారోగ్యంతో కన్ను మూశారు. ముకుల్ దేవ్, బాలీవుడ్, పంజాబీ, దక్షిణ భారత సినిమాల్లో నటించి మెప్పించారు. అంతే కాదు టెలివిజన్‌లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన మే 23వ తేదీ( శుక్రవారం) రాత్రి మరణించారు. ఆయన మరణ విషయాన్ని ఆయన సన్నిహితురాలు, నటి దీపశిఖా నాగ్‌పాల్ ఈ మరణవార్తను సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ముకుల్ దేవ్‌తో ఉన్న పాత చిత్రాన్ని పంచుకుంటూ “RIP” అని పేర్కొన్నారు. 

అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

ముకుల్ దేవ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్నారని, ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో ఐసియూలో చికిత్స పొందుతూ మరణించారని తెలుస్తుంది. ముకుల్ దేవ్ 1996లో “దస్తక్” సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. తెలుగులో రవితేజ హీరోగా నటించిన కృష్ణ సినిమాలో నటించి ఆకట్టుకున్నారు. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన ఏక్ విలన్ సినిమాలోనూ నటించారు.  అదేవిధంగా సిద్ధం, కేడి, అదుర్స్, బెజవాడ, మనీ మనీ మోర్ మనీ, నిప్పు, భాయ్ సినిమాల్లో నటించాడు. అలాగే హిందీలో  “సన్ ఆఫ్ సర్దార్”, “ఆర్… రాజ్‌కుమార్”, “జై హో”, “యమ్లా పగ్లా దీవానా” వంటి చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. హిందీతో పాటు, పంజాబీ, బెంగాలీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో కూడా నటించారు. ఆయన చివరి చిత్రం “అంత్ ది ఎండ్”. ఆయన తమ్ముడు, నటుడు రాహుల్ దేవ్ కూడా బాలీవుడ్‌లో నటుడిగా రాణిస్తున్నారు.

నటుడిగా, వ్యాఖ్యాతగా, పైలట్‌గా – బహుముఖ ప్రతిభాశాలి

న్యూఢిల్లీలోని పంజాబీ కుటుంబంలో జన్మించిన ముకుల్ దేవ్ తండ్రి హరి దేవ్ ఢిల్లీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేశారు. ఆయన ద్వారా ముకుల్‌కి ఆఫ్ఘన్ సంస్కృతితో పరిచయం ఏర్పడింది. ఆయన తండ్రి పష్తో, పర్షియన్ భాషలు మాట్లాడగలిగేవారు. ముకుల్ దేవ్ ఇండియాలోని ప్రముఖ పైలట్ శిక్షణ కేంద్రం – ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీ నుంచి పైలట్ శిక్షణ (Pilot training) కూడా పొందారు. పైలట్‌గానే కాకుండా, నటుడిగా, వ్యాఖ్యాతగా, డ్యాన్స్ ప్రదర్శకుడిగా ముకుల్ దేవ్ తన ప్రతిభను ప్రతిదిక్కూ చాటుకున్నారు. ఎనిమిదో తరగతిలోనే మైఖేల్ జాక్సన్ (Michael Jackson) నృత్యంతో దూరదర్శన్ డ్యాన్స్ షోలో మొదటి పారితోషికం అందుకున్నారు.

‘దస్తక్’తో వెండితెరకు పరిచయం – చిన్న తెరపై పలు విజయాలు

నటనపై ఆసక్తితో ముకుల్ దేవ్ ఎనిమిదో తరగతిలోనే తొలి పారితోషికం అందుకున్నారు. దూరదర్శన్ నిర్వహించిన ఓ డ్యాన్స్ షోలో మైఖేల్ జాక్సన్‌ను అనుకరించి ఆయన ఈ గుర్తింపు పొందారు. 1996లో ‘ముమ్కిన్’ అనే టెలివిజన్ సీరియల్‌లో విజయ్ పాండే పాత్రతో నటనారంగంలోకి అడుగుపెట్టారు. దూరదర్శన్‌లో ప్రసారమైన ‘ఏక్ సే బధ్ కర్ ఏక్’ అనే కామెడీ బాలీవుడ్ కౌంట్‌డౌన్ షోలో కూడా ఆయన నటించారు. ‘ఫియర్ ఫ్యాక్టర్ ఇండియా’ మొదటి సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇక సినిమాల విషయానికొస్తే, ‘దస్తక్’ చిత్రంతో ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. ఈ సినిమాలో ఏసీపీ రోహిత్ మల్హోత్రా పాత్రలో ఆయన నటించారు. ఈ చిత్రంతోనే మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ కూడా వెండితెరకు పరిచయమయ్యారు. ముకుల్ దేవ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

read also: Tamannaah Bhatia: త‌మ‌న్నాకు క‌ర్ణాట‌క ఎంపీ తీవ్ర హెచ్చరిక

#ActorDeath #ActorMukulDev #Bollywood #BollywoodNews #CelebTribute #DeathNews #HindiCinema #IndianActor #Mukul_Dev #MukulDevDeath #RIPMukulDev Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.