हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

ఛావా సినిమా పై మోదీ ప్రశంసలు

Ramya
ఛావా సినిమా పై మోదీ ప్రశంసలు

విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “చావా”, మరాఠా యోధుడు ఛత్రపతి మహారాజ్ శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం. ఈ సినిమా 2025 ఫిబ్రవరి 14న విడుదలైనప్పటి నుండి ప్రేక్షకుల మనసులపై బలంగా ముద్ర వేసింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో, రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. తొలి షోతోనే చావా సినిమా ఆ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. చరిత్రలో చాల మందికి తెలియని ఓ గొప్ప మహారాజ్ శంభాజీ గురించి ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో విక్కీ కౌశల్ తో పాటు.. రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. చావా చిత్రానికి లక్ష్మణ్ ఉడేకర్ దర్శకత్వం వహించారు. మాడాక్ ఫిల్మ్స్‌కు చెందిన దినేష్ విజన్ నిర్మించారు. ఈ చిత్రం శివాజీ సావంత్ మరాఠీ నవల చావా ఆధారంగా రూపొందించారు.

   ఛావా సినిమా పై మోదీ ప్రశంసలు

అద్భుతమైన నటన

ఈ చిత్రంలో విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్ పాత్రలో అద్భుతంగా నటించారు. శంభాజీ మహారాజ్ జీవితంలోని అనేక సందర్భాలను వివరించే ఈ చిత్రంలో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా ప్రారంభం నుంచే పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

చావా చిత్రం

“చావా” సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా, ఈ చిత్రం శివాజీ సావంత్ రచించిన మరాఠీ నవల “చావా” ఆధారంగా రూపొందించారు. డైనమిక్ కథ, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు ప్రత్యేకతను చేకూర్చాయి.

రికార్డు సృష్టించిన చిత్రం

“చావా” చిత్రం 2025 లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా రూ. 200 కోట్ల మార్కును దాటిన తొలి బాలీవుడ్ చిత్రం గా రికార్డు సృష్టించింది. సినిమా విడుదలైన తొలినెలలోనే అదనంగా కలెక్షన్ల సునామీ ఏర్పడింది, దీనితో సినిమా హిట్‌గా నిలిచింది. కాగా ఛావా సినిమా పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. విక్కీ నటనతో మరోసారి దేశ ప్రజలు ఛత్రపతి శివాజీని ఆయనకు కుమారుడు శంభాజీ మహారాజ్ ను తలుచుకుంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ ఈ సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు

ఈ చిత్రం కేవలం సినిమా ప్రేక్షకులను మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా అన్ని వర్గాల అభిమానులను ఆకర్షించింది. ముఖ్యంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ చిత్రాన్ని ప్రశంసించారు. 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనంలో మాట్లాడుతూ, “ఛావా సినిమా ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి పొందింది. మహారాష్ట్ర ప్రజలు ఎంతో గొప్ప సాహిత్యాన్ని అందించారు” అని ఆయన పేర్కొన్నారు. దేశంలో మరాఠీ భాష చాలా గొప్ప దళిత సాహిత్యాన్ని అందించిందని, మహారాష్ట్ర ప్రజలు గతంలో సైన్స్, ఆయుర్వేదం, లాజికల్, రీజనింగ్ వంటి వాటికి అద్భుతమైన కృషి చేశారని మోదీ అన్నారు. మహారాష్ట్ర, ముంబై కేవలం హిందీ సినిమాలు మాత్రమే కాకుండా మరాఠీ చిత్రాల స్థాయిని పెంచడంలో కీలక పాత్ర పోషించిందని మోదీ చెప్పుకొచ్చారు.

“చావా” సినిమా, మహారాష్ట్ర సాంస్కృతిక గర్వం, శంభాజీ మహారాజ్ గొప్పతనం, మరియు యుద్ధపు వైవిధ్యాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తుంది. ఇది సినిమాను చూసే ప్రతి ఒక్కరి మనసుని గాఢంగా ప్రభావితం చేస్తుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870