Mirai Trailer : హను-మాన్ తో బాక్సాఫీస్‌ను కదిలించిన సజ్జా తేజ, ఈసారి మిరాయి సూపర్ యోధగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్-మైథాలజీ చిత్రం Mirai Trailer ట్రైలర్ ఇంటర్నెట్‌లో దుమ్మురేపుతోంది.
కథలో యోధ (సజ్జా తేజ)కు ఎదురుగా బ్లాక్ స్వోర్డ్ (మంచు మనోజ్) అనే శక్తివంతమైన శత్రువు నిలుస్తాడు. అతను నల్ల మంత్ర విద్యలో ప్రావీణ్యం సంపాదించి, అశోక చక్రవర్తి తొమ్మిది పవిత్ర గ్రంథాలను పొందాలని చూస్తాడు. ధర్మరక్షకులు అయిన ధర్మశాల ప్రజలు, యోధను ఆపద నుంచి రక్షకుడిగా పిలుస్తారు. యుగాల క్రితం శ్రీరామచంద్రుడు ఉపయోగించిన దివ్యాస్త్రం మిరాయి దండను యోధ స్వీకరించాల్సి వస్తుంది.

ట్రైలర్‌లోని అద్భుత యాక్షన్ సన్నివేశాలు, గ్రాఫిక్స్, ఈగిల్ ఎంట్రీ, చివర్లో శ్రీరాముడి అద్భుత దర్శనం కలిపి గూస్‌బంప్స్ ఇచ్చేలా ఉన్నాయి. గోవ్ర హరి సంగీతం ఉత్కంఠను మరింత పెంచింది.
ఈ చిత్రం సెప్టెంబర్ 12, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జగపతి బాబు, రితికా నాయక్, జయరామ్, శ్రియా శరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే భారీ బిజినెస్ సాధించిన మిరాయి – సూపర్ యోధ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
Read also :