📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Marana Mass Movie: మరణ మాస్ (సోనీ లివ్) మూవీ రివ్యూ

Author Icon By Anusha
Updated: May 15, 2025 • 4:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ మధ్యన ఓటీటీల్లో మలయాళం సినిమాలదే హవా. జానర్ ఏదైనా మాలీవుడ్ సినిమాలను చూసేందుకు మూవీ లవర్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలంటేమరీనూ. మలయాళంలో బాసిల్ జోసెఫ్ కి మంచి క్రేజ్ ఉంది. ఈ మధ్య కాలంలో ఆయన అక్కడ కామెడీకి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయాడు.అలాంటి ఆయన ప్రధాన పాత్రధారిగా రూపొందిన సినిమానే ‘మరణ మాస్’. శివప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఏప్రిల్ 10వ తేదీన థియేటర్ లోకి వచ్చింది.బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టిన సినిమా ఇది. అలాంటి ఈ సినిమా, ఈ రోజు నుంచే ‘ సోనీ లివ్’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ బ్లాక్ కామెడీ ఎంతవరకూ నవ్వించిందనేది చూద్దాం. 

మరణ మాస్ (సోనీ లివ్) మూవీ రివ్యూ

కథ

కేరళలోని ఓ గ్రామంలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. చీకటిపడితే చాలు, బయటికి రావడానికి జనాలు భయపడుతూ ఉంటారు. కిల్లర్ హత్య చేసిన అనంతరం శవాల నోట్లో ‘అరటిపండు’ పెడుతూ ఉంటాడు. దాంతో అందరూ అతనిని ‘బనానా కిల్లర్’ అని పిలుచుకుంటూ ఉంటారు. అదే గ్రామానికి చెందిన ల్యూక్ (బాసిల్) జెస్సీ (అనీష్మా)ని లవ్ చేస్తూ ఉంటాడు. ల్యూక్ లుక్ స్టైల్ కాస్త డిఫరెంట్ గా ఉండటంతో, అతనే కిల్లర్ అనే ఒక ప్రచారం జరుగుతూ ఉంటుంది. ‘బనానా కిల్లర్’ కేసును ఛేదించడానికి పోలీస్ ఆఫీసర్ అజయ్ రామచంద్రన్ (ఆంటోని) రంగంలోకి దిగుతాడు. ఇక జిక్కు డ్రైవర్ గా పనిచేసే ట్రావెల్స్ బస్ కి అరవింద్ కండక్టర్(Conductor) గా పనిచేస్తూ ఉంటాడు. 20 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన తన తండ్రి ఎప్పుడు తిరిగి వస్తాడా అనే అరవింద్ ఎదురుచూస్తూ ఉంటాడు. ఇక జిక్కూ మాత్రం త్వరలో తన పెళ్లి జరగనున్నందుకు హ్యాపీగా ఉంటాడు.సాధ్యమైనంత త్వరగా డ్యూటీ దిగాలని కంగారులో ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ‘కేశవ’ అనే ఒక వృద్ధుడిని వెంటబెట్టుకుని ఆ సీరియల్ కిల్లర్(Serial killer) ఈ బస్సు ఎక్కుతాడు. అతను ఆ వృద్ధుడిని చంపాలనే ఆలోచనలో ఉంటాడు. అదే సమయంలో జెస్సీ ఆ బస్సు ఎక్కుతుంది. జీవితం పట్ల సీరియస్ నెస్ లేదనీ, అందువల్లనే ల్యూక్ ను కిల్లర్ గా అనుమానిస్తున్నారని జెస్సీ భావిస్తుంది. అతనికి బ్రేకప్ చెబుతుంది. దాంతో ఆమెను బ్రతిమాలటం కోసం ల్యూక్ కూడా ఆ బస్సు ఎక్కుతాడు.ఒక వైపున సైకో కిల్లర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తూ ఉంటే, ప్రధానమైన పాత్రలన్నీ సైకో ఉన్న బస్సులోకి వచ్చి చేరతాయి. ఆ బస్సులో ఏం జరుగుతుంది? ఆ సైకో ఎవరు? కేశవతో ఆ సైకోకి ఉన్న సంబంధం ఏమిటి? లవర్ కోసం బస్సు ఎక్కిన ల్యూక్ కి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? తనపై పడిన కిల్లర్ ముద్రను అతను చెరిపేసుకుంటాడా? అనేది కథ.

Read Also: Jr NTR: దాదాసాహెబ్ ఫాల్కేగా నటించనున్న ఎన్టీఆర్?

#BasilJoseph #MalayalamCinema #MaranMass #SonyLIV Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.