📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Mandakini Movie :’మందాకిని’ మూవీ రివ్యూ..

Author Icon By Anusha
Updated: March 29, 2025 • 5:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గతేడాది మే నెలలో థియేటర్లలో విడుదలై కమర్షియల్ హిట్ గా నిలిచిన సినిమా మందాకిని. మలయాళంలో విడుదలైన ఈ సినిమా మొదటి రోజే పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. ఒక కోటి కంటే తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.3 కోట్ల వరకు రాబట్టింది. విభిన్నమైన కథతోపాటు కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. డైరెక్టర్ వినోద్ లీలా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనార్కలి మరిక్కర్ కథానాయికగా నటించగా,అల్తాప్ సమీమ్ హీరోగా నటించారు. ఈ సినిమాలో కామెడీ టైమింగ్ మరింత హైలెట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా మలయాళ వెర్షన్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా ఈ సినిమా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.

కథ

అరవింద్ (అల్తాఫ్ సలీమ్) ఓ మధ్యతరగతి యువకుడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో, తల్లి డ్రైవింగ్ స్కూల్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంది. అతని అక్క ఆర్తి విష్ణును వివాహం చేసుకుంటుంది. కానీ, విష్ణు తాగుడుకు బానిసగా మారడంతో ఆర్తి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంది.అరవింద్,ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అయితే, తనని నిజంగా ప్రేమించే అమ్మాయి దొరకక, నిరాశలోకి వెళ్లిపోతాడు. ఈ క్రమంలోనే అమ్ములు (అనార్కలి మారికార్) తో పరిచయం ఏర్పడుతుంది. అందమైన అమ్మాయి తనను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడంతో, అరవింద్ జీవితంలో కొత్త కలల్ని కంటాడు.కానీ, ఫస్ట్ నైట్ నాడు పరిస్థితి తారుమారు అవుతుంది. అక్క భార్య విష్ణు, అరవింద్ తాగే జ్యూస్‌లో మద్యం కలుపుతాడు. అయితే, అది అనార్కలి తాగడంతో, ఆమె మైకంలోకి వెళ్లి, తన పెళ్లికి ముందు సుజిత్ వాసుతో ప్రేమాయణం ఉందని అత్తగారి ముందే చెప్పేస్తుంది. దీంతో, కొత్తగా పెళ్లైన ఈ జంట జీవితంలో ఏమి జరుగుతుంది? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ

‘మందాకిని’ సామాజికంగా ప్రాముఖ్యతగల అంశాన్ని ఆసక్తికరంగా మలచిన సినిమా. మాములుగా తల్లిదండ్రులు తమ కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని చూస్తారు. కానీ, ఆ అమ్మాయికి పెళ్లికి ముందు ఇతర సంబంధం ఉందని తెలుసుకుంటే, కుటుంబం ఎలా స్పందిస్తుంది? అనే అంశాన్ని ఆసక్తికరంగా మలిచారు.ఈ కథలో కీలక మలుపు తిప్పే అంశం – మద్యం. కామెడీ ప్రధానంగా నడిచే ఈ కథలో, తాగుడు వల్ల కుటుంబాల్లో కలిగే అనర్థాలను కూడా హాస్యభరితంగా చూపించడానికి దర్శకుడు ప్రయత్నించాడు. కొన్ని సన్నివేశాల్లో ఈ కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది. అయితే, మద్యం గురించిన అంశాన్ని కొంతవరకే హాస్యంగా చూపించాల్సిన అవసరం ఉండగా, కొన్ని చోట్ల అది శృతిమించి కనిపించడంతో కథ కొంత గందరగోలంగా అనిపిస్తుంది.దర్శకుడు కథను సహజత్వానికి దగ్గరగా తీర్చిదిద్దడానికి మంచి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా, ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ హాస్య ప్రధానంగా సాగుతాయి. బడ్జెట్ పరంగా చూసినప్పటికీ, సరదాగా తక్కువ వ్యయంతో మంచి కంటెంట్ అందించడంలో దర్శకుడు విజయవంతమయ్యారు.

#AltasSaleem #AnarkaliMarikar #ETVWin #IndianCinema #MalayalamCinema #MalayalamMovies #Mandakini #MovieReview #RomanticComedy #VinodLeela Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.