Manchu Manoj: పాత ఫోన్‌కు iPhone 17 కవర్.. యువతకు మెసేజ్!

Read Time:  1 min
Manchu Manoj: పాత ఫోన్‌కు iPhone 17 కవర్.. యువతకు మెసేజ్!
FONT SIZE
GET APP
Manchu Manoj: iPhone 17 cover for old phone.. Message to the youth!
Manchu Manoj: iPhone 17 cover for old phone.. Message to the youth!

Manchu Manoj: వేదికపై ప్రసంగిస్తూ.. తన దగ్గర ఉన్న పాత మోడల్ ఐఫోన్‌ను విద్యార్థులకు చూపించారు మనోజ్. దానికి iPhone 17 Pro Max అని రాసి ఉన్న కవర్‌ను వేసి వాడుతున్నట్లు తమాషాగా చూపిస్తూనే, లోతైన అర్థాన్ని వివరించారు. “పక్కవారి మెప్పు కోసమో, సమాజంలో గొప్పలు చెప్పుకోవడానికో అప్పులు చేసి ఖరీదైన వస్తువులు కొనవద్దు. విలాసాల కోసం తలిదండ్రులను ఇబ్బంది పెట్టకండి,” అని ఆయన హితవు పలికారు.

Read Also: Vijay Sangeetha Divorce: విజయ్ భార్య సంగీత ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి?

ఉన్నదానితో తృప్తి చెందండి

డబ్బు విలువను గుర్తిస్తూ, ఉన్న వనరులతోనే సంతోషంగా ఉండటం అలవాటు చేసుకోవాలని మనోజ్ సూచించారు. ఆర్భాటాలకు పోయి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవద్దని, డబ్బును వృథా చేయకుండా భవిష్యత్తు కోసం జాగ్రత్త పడాలని యువతకు పిలుపునిచ్చారు. ఒక స్టార్ హీరో అయ్యి ఉండి కూడా, పాత ఫోన్‌ను వాడుతూ ఆయన చూపిన నిరాడంబరత విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. మరి ఈ ‘రియల్ లైఫ్’ సందేశాన్ని నేటి తరం ఎంతవరకు స్ఫూర్తిగా తీసుకుంటుందో చూడాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.