Mammootty Health Update: తొలిసారి ఆరోగ్య సమస్యపై నోరు విప్పిన మ‌మ్ముట్టి

Read Time:  1 min
Mammootty Health Update: తొలిసారి ఆరోగ్య సమస్యపై నోరు విప్పిన మ‌మ్ముట్టి
FONT SIZE
GET APP

Mammootty Health Update: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తన అనారోగ్యంపై వస్తున్న వార్తలపై తొలిసారి స్పందించారు. గత ఏడాది జూన్ లో అనారోగ్యానికి గురై నాలుగు నెలల పాటు సినిమాలకు విరామం తీసుకున్న ఆయన, ఆ సమయంలో రుచి, వాసన శక్తిని కోల్పోయానని, ఇప్పుడిప్పుడే తిరిగి పొందుతున్నానని తెలిపారు. కంటి చూపు, వినికిడి, శ్వాసతో పాటు వాసనను గుర్తించగలగడం గొప్ప వరమని, వాటి విలువ కోల్పోయినప్పుడే తెలుస్తుందని భావోద్వేగంగా మాట్లాడారు. ప్రస్తుతం మమ్ముట్టి పూర్తి ఆరోగ్యంతో తిరిగి షూటింగ్‌లలో బిజీ అయ్యారు.

Read Also: Bollywood Actor: సిద్ధార్థ్ మల్హోత్రాకి పితృవియోగం

Mammootty Health Update: తొలిసారి ఆరోగ్య సమస్యపై నోరు విప్పిన మ‌మ్ముట్టి
Mammootty Health Update: Mammootty opens up about his health issue for the first time

మహేష్ నారాయణన్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పేట్రియాట్’ (Patriot). ఈ సినిమా కోసం మ‌మ్ముట్టి (Mammootty) ఇటీవలే డబ్బింగ్ పనులను కూడా పూర్తి చేశారు. ఈ సినిమా మలయాళ చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక మైలురాయిగా నిలవనుంది. ఎందుకంటే సుమారు 18 ఏళ్ల తర్వాత మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి పూర్తిస్థాయి పాత్రల్లో స్క్రీన్‌ను పంచుకుంటున్నారు. వీరిద్దరితో పాటు విలక్షణ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తుండటం విశేషం. నయనతార, కుంచాకో బోబన్ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.