हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Jaat Movie: ‘జాట్’ సినిమాకి సీక్వెల్ ప్రకటించిన మేకర్స్

Anusha
Jaat Movie: ‘జాట్’ సినిమాకి సీక్వెల్ ప్రకటించిన మేకర్స్

ప్రముఖ బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ జాట్ సినిమాలో నటించారు, ‘ గద్దర్ 2’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత, వరుస ప్రాజెక్టుల‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ‘బోర్డర్ 2’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న ఆయన,జాట్ సినిమాతోతెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వబోతున్నాడు.ఈ చిత్రానికి క్రాక్, వీరా సింహ రెడ్డి చిత్రాల ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వహించాడు.గోపిచంద్ మలినేని గతంలో ‘క్రాక్’, ‘వీర సింహా రెడ్డి’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈసారి బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్‌తో జత కట్టాడు,టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌసెస్ మైత్రీ మూవీ మేకర్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించాయి. ఏప్రిల్ 10న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజైన ఈ యాక్షన్ మూవీకి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. సౌత్ స్టేట్స్ లో ఎలాంటి ప్రభావం చూపనప్పటికీ, నార్త్ లో మాత్రం డీసెంట్ వసూళ్లు వస్తున్నాయి. 

పోస్టర్ రిలీజ్

‘జాట్’ సినిమా సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీక్ రన్ పూర్తి చేసుకొని, రెండో వారంలో ఎంటర్ అయింది. బాక్సాఫీస్ దగ్గర 7 రోజుల్లో రూ. 70.4 కోట్లు వసూలు చేసినట్లుగా మేకర్స్ తాజాగా పోస్టర్ రిలీజ్ చేసారు. నిర్మాతలు ప్రకటించిన లెక్కల ప్రకారం, మొదటి రోజు రూ.11.6 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం రెండో రోజు రూ. 8. కోట్లు, థర్డ్ డే రూ. 12.1 కోటి కలెక్షన్స్ రాబట్టింది. 4వ రోజు 17.1 కోట్లు 5వ రోజు 8.9 కోట్లు 6వ రోజు 7.25 కోట్లు వసూలు చేసింది. ఏడవ రోజు మాత్రం దగ్గర దగ్గర రూ. 5 కోట్ల వరకూ రాబట్టినట్లు తెలుస్తోంది. ట్రెండ్ చూస్తుంటే సెకండ్ వీకెండ్ లో 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సీక్వెల్

‘జాట్’ సినిమాకి సీక్వెల్ తీయబోతున్నట్లుగా మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ‘జాట్ 2’ అనే టైటిల్ తో ఓ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసారు. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత జాట్ రెస్ట్ తీసుకోవడం లేదని.. అతను మరో కొత్త మిషన్ వైపు వెళ్తున్నాడని పేర్కొన్నారు. ఈసారి మాస్ ఫీస్ట్ మరింత పెద్దదిగా, ధైర్యంగా, వైల్డ్‌గా ఉంటుందని తెలిపారు. సన్నీడియోల్ ప్రధాన పాత్రలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. నవీన్ ఎర్నేని, వై రవి శంకర్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు.

Read Also:Prithviraj Sukumaran: ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్న పృథ్వీరాజ్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870