📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం

Latest News: Sonakshi Sinha – ఈ-కామర్స్ సైట్లపై సోనాక్షి సిన్హా ఆగ్రహం

Author Icon By Anusha
Updated: September 3, 2025 • 5:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన కెరీర్‌లో ఎప్పుడూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను కాపాడుకుంటూ ముందుకు సాగుతున్న స్టార్ హీరోయిన్. కానీ తాజాగా ఆమె వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించే సంఘటనలు చోటుచేసుకోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.సోనాక్షి సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాల ప్రకారం – కొన్ని ప్రముఖ ఈ–కామర్స్ సంస్థలు (commerce sites), ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లు తమ వ్యాపార ప్రయోజనాల కోసం ఆమె ఫొటోలను అనుమతి లేకుండా వాడుకుంటున్నాయి. తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడానికి, ప్రకటనల్లో ఆమె ఫొటోలను పెట్టి వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయని ఆమె ఆరోపించారు.

వాణిజ్య ప్రకటనల కోసం వాడుకోవడం

తాను తరచుగా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తుంటానని, ఆ సమయంలో కొన్ని ప్రముఖ వెబ్‌సైట్లలో తన ఫొటోలను చూసి షాక్ అయినట్లు సోనాక్షి (Sonakshi Sinha) తెలిపారు. తన అనుమతి కానీ, కనీసం సమాచారం కానీ లేకుండా తన వ్యక్తిగత ఫొటోలను వాణిజ్య ప్రకటనల కోసం వాడుకోవడం నైతికంగా సరైంది కాదని ఆమె అన్నారు. “ఏదైనా డ్రెస్ లేదా ఆభరణం నచ్చితే, ఆ బ్రాండ్ వివరాలతో సోషల్ మీడియాలో పోస్ట్ పెడతాను. అంతమాత్రాన నా ఫొటోలను మీ వెబ్‌సైట్‌లో పెట్టుకుని వ్యాపారం చేసుకుంటానంటే అస్సలు ఊరుకోను. వెంటనే నా ఫొటోలు తొలగించండి, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని తన పోస్టులో సోనాక్షి సిన్హా హెచ్చరించారు.

Latest News

పలువురు నెటిజన్లు

సెలబ్రిటీల ఫొటోలను వారి అనుమతి లేకుండా వ్యాపారానికి వాడుకోవడం సరికాదంటూ సోనాక్షి తీసుకున్న ఈ స్టాండ్‌కు పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే, సోనాక్షి సిన్హా ఇటీవల ‘నికితా రాయ్’ అనే సైకలాజికల్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను పలకరించారు. ఆమె సోదరుడు ఖుష్ ఎన్ సిన్హా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, పరేశ్ రావల్ కీలక పాత్రలు పోషించారు. గతేడాది విడుదలైన ‘హీరామండీ’ వెబ్‌సిరీస్‌తో కూడా సోనాక్షి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు

సోనాక్షి సిన్హా ఎవరు?

సోనాక్షి సిన్హా బాలీవుడ్ నటి. ఆమె ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా, పూనం సిన్హా కూతురు.

సోనాక్షి సిన్హా జననం ఎప్పుడు, ఎక్కడ జరిగింది?

సోనాక్షి సిన్హా 1987 జూన్ 2న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-soubin-shahir-actor-soubin-shahir-faces-setback-in-court-in-cheating-case/cinema/540719/

Bollywood actress Breaking News ecommerce controversy latest news legal action warning online shopping Sonakshi Sinha Telugu News unauthorized photo use

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.