📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Actor: ఆరుముగ కుమార్ నాకు మొదటి సారి అవకాశం ఇచ్చారు: విజయ్ సేతుపతి

Author Icon By Anusha
Updated: May 18, 2025 • 5:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన మక్కల్ సెల్వన్ విజయ్‌ సేతుపతి కెరీర్ ప్రారంభంలో క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించి, ఇప్పుడు హీరోగా రాణిస్తున్నారు. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ, తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు.ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సేతుపతి ‘ఏస్’ (Ace) అనే చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేసారు. విజయ్ సేతుపతి(Vijay Sethupathi), రుక్మిణీ వసంత్‌ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఏస్’. అరుముగకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇదొక కమర్షియల్‌ యాక్షన్ థ్రిల్లర్.ఇందులో బోల్డ్‌ కన్నన్‌ అనే పాత్రలో సేతుపతి కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా రోజుల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయనున్నారు. ఈ నెల 23, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్.ఉత్కంఠకు గురిచేసే కథ, కథనాలతో ఈ సినిమా రూపొందిందని, విజయ్‌సేతుపతి కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలిచే సినిమా ఇదని మేకర్స్‌ చెబుతున్నారు. 

అవకాశం

ఈ సినిమా తెలుగు హక్కులను శ్రీ పద్మిణి సినిమాస్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ‘ఏస్’ ప్రమోషన్లలో బిజీగా పాల్గొంటున్న విజయ్ సేతుపతి డైరెక్టర్ ఆరుముగ కుమార్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. నటుడిగా తాను ఈ స్థాయిలో ఉండటానికి ఆయనే కారణమని పాత విషయాలను గుర్తుకుతెచ్చుకున్నారు.సినిమాల్లో అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు ‘వర్ణం’ అనే మూవీ ఆడిషన్‌కి వెళ్లారు. అక్కడ భూపతి అనే మేనేజర్ నా ఫోటోలు నిర్మాతలకు ఇచ్చాడు. వాళ్లు నన్ను పిలిచి సన్నివేశం గురించి చెప్పి నన్నే డైలాగులు రాసుకుని నటించమని చెప్పారు. అప్పటివరకు నేను డైలాగులు రాయగలగనని నాకే తెలియదు. ఏవో కొన్ని డైలాగులు రాసి దగ్గర్లోని షాప్‌లో హెయిర్ జెల్ కొనుగోలు చేసి దాన్ని రాసుకుని నటించి చూపించాను. ఆ చిత్రానికి ఆరుముగ కుమారే(Arumuga Kumar) డైరెక్టర్. నన్ను తీసుకోవాలా వద్దా అని నిర్మాతలు ఆలోచిస్తున్న సమయంలో ఆయన వెళ్లి ఈ అబ్బాయి చాలా బాగా నటించాడు.తప్పకుండా తీసుకోండని నన్ను సిఫార్స్ చేశారు. అలా నాకు సినిమాల్లో తొలి అవకాశం ఆరుముగ కుమార్ వల్లే వచ్చింది. ఆ తర్వాత ‘నడువుల కొంజం పక్కా కనోమ్’ మూవీకి కూడా నన్ను తీసుకోని టైమ్‌తో ఆరుముగ సారే సిఫార్స్ చేశారట.

Actor: ఆరుముగ కుమార్ నాకు మొదటి సారి అవకాశం ఇచ్చారు: విజయ్ సేతుపతి

విలనిజం

ఈ విషయం ‘96‘ డైరెక్టర్ ప్రేమ్ ద్వారా నాకు తెలిసింది. అలా నా కెరీర్‌లో తొలి అడుగులు వేస్తున్న సమయంలో ఆరుముగ కుమారే నాకు అండగా నిలిచారు. ఈ జీవితం ఆయన ఇచ్చిందే. అందుకు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను’ అని ఆనాటి ఘటనను గుర్తుచేసుకున్నారు విజయ్ సేతుపతి. ప్రస్తుతం విజయ్ కామెంట్స్ వైరల్‌గా మారాయి.ఇక ‘ఉప్పెన’, ‘సైరా’ చిత్రాలతో తెలుగువారికి పరిచయమైన విజయ్ సేతుపతి తమిళంలో అగ్రనటుడిగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ‘జవాన్’తో బాలీవుడ్‌లో విలనిజం చూపించారు. తమిళంలో అనేక ప్రాజెక్టులు చేతిలో ఉండగానే తెలుగులో పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో ఓ ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో సీనియర్ నటి టబు కీలకపాత్రలో నటిస్తున్నారు.

Read Also: Actor: లైఫ్ పార్టనర్ గురించి ఆలోచించడం లేదు: విజయ్ దేవరకొండ

#Arumugakumar #NaduvulaKonjamPakkathaKaanom #Varnam #VijaySethupathi Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.