శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం కుబేర. తమిళ నటుడు ధనుష్, టాలీవుడ్ నటుడు నాగార్జున, రష్మిక మందన్నా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కుబేర సినిమా (Kuberaa Movie) కు ఏపీలో టిక్కెట్ రేట్లు పెంపునకి అనుమతి లభించింది. మల్టిప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్‌లో గరిష్టంగా 75 రూపాయలు వరకు పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పది రోజులపాటు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు ఫిల్మ్ చాంబర్ (Telugu Film Chamber) ద్వారా టికెట్ ధరల పెంపు కోసం హోంశాఖకు కుబేర నిర్మాతలు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఏపీలో కాస్త ఓపెనింగ్స్ నంబర్స్ పెరిగే అవకాశం ఉంది.తెలంగాణలో మాత్రం ఈ టికెట్ల రేట్లు పెంచుకునే ఆస్కారం లభించలేనట్టుగా ఉంది.
పెంచాల్సిన ఆస్కారం
అసలే ఇక్కడ టికెట్ రేట్ల పెంపు, అదనపు షోల అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం లేదన్న సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటన తరువాత తెలంగాణ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రతీ సినిమాకు టికెట్ రేట్ల (Movie ticket rates) పెంపులో అనుమతులు ఇస్తూనే ఉంది.కుబేర సినిమాకు నిర్మాతలు మామూలుగానే ఖర్చు పెట్టి ఉంటారు. అసలు ఇలాంటి సినిమాకి కూడా టికెట్ రేట్లు పెంచడం ఏంటి? ఇందులో పెంచాల్సిన ఆస్కారం ఏముంది? అని కూడా కొంత మంది అనుకుంటున్నారు. మరి ఈ పెంచిన టికెట్ రేట్లతో లాభం కలుగుతుందా? నష్టం వాటిల్లుతుందా? అన్నది చూడాలి.
నెట్టింట్లో వైరల్
ఈ టికెట్ రేట్ల పెంపుపై ఆర్ నారాయణ మూర్తి కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.కుబేర టీం ప్రస్తుతం ప్రమోషన్స్ ను పూర్తి చేసింది. శేఖర్ కమ్ముల అయితే సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నారు. ధనుష్ (Dhanush) కూడా శేఖర్ కమ్ములని పూర్తిగా నమ్మి ఈ సినిమాలో నటించారు.సూపర్ డైరెక్టర్ అని నమ్మితే తనను రోడ్డు మీద బిచ్చగాడ్ని చేశారు అంటూ ధనుష్ ఫన్నీగా ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇక నాగార్జున పాత్ర కూడా ఇందులో స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని అంటున్నారు. రష్మిక మరోసారి మెస్మరైజ్ చేసేలా కనిపిస్తున్నారు. ధనుష్, రష్మిక కాంబోని చూసిన వారంతా సర్ ప్రైజ్ అవుతారని తెలుస్తోంది.