📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Kalpika Ganesh: నటి కల్పిక గణేశ్‌పై కేసు నమోదు.. కారణం ఏంటంటే?

Author Icon By Anusha
Updated: June 12, 2025 • 12:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్ నటి కల్పిక చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.హైదరాబాద్‌ నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని ప్రిజం పబ్‌ (Prism Pub) సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించిన కారణంగా గచ్చిబౌలి పోలీసులు (Gachibowli police) నటిపై కేసు నమోదు చేశారు.గత నెల 29 ప్రిజం పబ్‏లో బిల్ పే చేయకుండా పబ్ సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిందని,తమ సిబ్బందిని బూతులు తిట్టడంతోపాటు బాడీ షేమింగ్ చేసిందని, ప్లేట్స్ విసిరేయడం జరిగిందంటూ పబ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై 324(4), 352, 351(2) BNS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

క్షమాపణ చెప్పాలంటూ

బర్త్ డే కేక్ విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరగ్గా సిబ్బందిని కల్పిక బూతులు తిట్టిందని పబ్ యాజమాన్యం ఆరోపించింది. ఇదిలా ఉంటే గచ్చిబౌలి విప్రో సర్కిల్(Gachibowli Wipro Circle) వద్ద ఉన్న ప్రిజం పబ్ లో బర్త్ డే వేడుకలు నిర్వహించారని బర్త్ డే కేక్ విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరగ్గా పబ్ సిబ్బంది తనపై దాడి చేశారని కల్పిక తెలిపింది.తన పట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తించి బూతులు తిట్టారని తనకు క్షమాపణ చెప్పాలంటూ పబ్ బయట కల్పిక వాగ్వాదానికి దిగింది.ఇక ఇప్పుడు కల్పికపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Kalpika Ganesh

సినిమాల్లో మంచి

గత నెల 29న కల్పిక గణేష్ బర్త్‌డే కావడంతో తన ఫ్రెండ్స్‌కీ ప్రిజం పబ్ లో పార్టీ ఇచ్చింది. బర్త్ డే కేక్ విషయమై పబ్ నిర్వాహకులకు, కల్పికకి గొడవ జరిగింది. ఆ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఇప్పుడు ఇదే విషయమై పబ్ యాజమాన్యం ఫిర్యాదుతో గచ్చిబౌలి పీఎస్‌లో కల్పికపై కేసు నమోదైంది.కాగా కల్పిక,సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, యశోద, నమో వెంకటేశా, జులాయి, సారొచ్చారు, హిట్-1, పడి పడి లేచే మనసు వంటి సినిమాల్లో మంచి పేరే సంపాదించుకుంది. కొన్ని వెబ్‌సిరీసుల్లోనూ నటించింది. కానీ కొన్నాళ్ల క్రితం వరుస వివాదాల్లో చిక్కుకున్న కల్పిక ఇప్పుడు ఈ పబ్‌ వివాదంతో వార్తల్లో నిలిచింది.

Read Also: Coolie: ఆగస్టు 14న భారీస్థాయిలో కూలీ విడుదలకు సన్నాహాలు

#ActressKalpika #celebrityscandal #HyderabadNews #KalpikaGanesh #TollywoodNews Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.