📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Kajol: రామోజీ ఫిలిం సిటీపై కాజోల్ షాకింగ్ కామెంట్స్

Author Icon By Anusha
Updated: June 18, 2025 • 3:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ అగర్వాల్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు సౌత్ లో ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే న‌టించింది. కాక‌పోతే కాజోల్ న‌టించిన హిందీ చిత్రాలు తెలుగులో డ‌బ్ అయి దక్షిణాది ప్రేక్షకుల్లోనూ ఆమెకి మంచి గుర్తింపు వ‌చ్చేలా చేశాయి. 1992 నుంచి కాజోల్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ వ‌చ్చింది.స్టార్ హీరోలు షారుక్ ఖాన్, అజయ్ దేవగన్ (Ajay Devgan) స‌ర‌స‌న ఎక్కువ సినిమాలు చేసింది. షారుఖ్ ఖాన్ – కాజోల్ ఆన్ స్క్రీన్ పెయిర్ కు అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేదో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వీరి కాంబినేషన్ లో వ‌చ్చిన బాజీగర్, డూప్లికేట్, దిల్ వాలే దుల్హానియా లే జాయేగి, కుచ్ కుచ్ హోతా హ, కబీ ఖుషి కబీ గమ్, కహో నా హో, రబ్ నే బనాది జోడి వంటి చిత్రాలు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి.

జీవితంలో మరోసారి

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన ఓ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగ్గా ఆ స‌మ‌యంలో తాను నెగిటివ్ వైబ్స్ ఎదుర్కొన్నానని కాజోల్ (Kajol) చెప్పుకొచ్చారు. కొన్ని ప్రదేశాలు భయపెట్టాయి. వెంట‌నే అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకున్నాను. జీవితంలో మరోసారి రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్లాలనుకోలేదని ఆమె అన్నారు. అంతే కాదు రామోజీ ఫిల్మ్ సిటీని ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రదేశాలలో ఒకటిగా వర్ణిస్తూ కామెంట్ చేసింది కాజోల్. మరి కాజోల్ ని అంతలా భయపెట్టిన సంఘటన ఏంటది మాత్రం రివీల్ చేయ‌లేదు.

ఫిల్మ్ స్టూడియో

భారతదేశంలో ఉన్న అతి పెద్ద సినీ స్టూడియోలలో ‘రామోజీ ఫిలిం సిటీ’ (Ramoji Film City) ఒకటి. హైదరాబాద్‌ నగర శివార్లలో దాదాపు 2000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అతి పెద్ద ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ స్టూడియోగా ప్రసిద్ధి చెందింది. దీనిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్‌గా గుర్తించింది.ఇందులో తెలుగు సినిమాలే కాకుండా దేశ, విదేశాలకు చెందిన అనేక భాషా చిత్రాలు, టెలివిజన్ సీరియళ్లు నిర్మించబడుతుంటాయి. ఇది సినీ హబ్ మాత్రమే కాదు, పాపులర్ హాలిడే డెస్టినేషన్ కూడా. ప్రతి ఏడాది సుమారు 15 లక్షల మంది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు.రామోజీ ఫిలిం సిటీ దక్షిణాదికే కాదు, మొత్తం ఇండియన్ సినిమాకే గర్వకారణం. అలాంటి పాపులర్ ప్లేస్ పై కాజోల్ కామెంట్స్ చేయడాన్ని అందరూ ఖండిస్తున్నారు. దీనిపై ఆమె వివరణ ఇస్తారేమో చూడాలి. 

Read Also: Kolla Movie: ఉత్కంఠ రేపే మలయాళ సినిమా ఓటీటీలోకి

#BollywoodBuzz #HauntedPlaces #Kajol #RamojiFilmCity #SpookyExperience Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.