📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

JR NTR: ఎన్టీఆర్ కు నివాళుర్పించిన జూనియర్‌ ఎన్టీఆర్‌,ఇతర కుటుంబ సభ్యులు

Author Icon By Anusha
Updated: May 28, 2025 • 12:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు,దివంగత నేత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా,ప్రముఖ నటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఆయనకు నివాళి అర్పించారు. ఈ ఉదయం వాళ్లు హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించారు. సమాధిపై పూలమాలలు ఉంచి వారి తాతను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ జయంతి(NTR’s birthday) సందర్భంగా ఘాట్ ను అలంకరించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి రానున్నందున బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు పోలీస్ సిబ్బందిని నియమించారు. వాహనాల రాకపోకలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నారు. 

నివాళులు

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రముఖుల రాక సందర్భంగా ఘాట్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. నందమూరి కుటుంబసభ్యులతో పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ నారా భువనేశ్వరి, టీడీపీ నేతలు, అభిమానులు, రాజకీయ సినీ ప్రముఖులు, తదితరులు ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ, సినీ దర్శకుడు వైవీఎస్ చౌదరి(YVS Chowdhury)ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పించి, యుగ పురుషుడును స్మరించుకున్నారు. ఎన్టీఆర్ కుమారునిగా పుట్టడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాని రామకృష్ణ చెప్పారు. తెలుగు వారికి, మన రాష్ట్రానికి గుర్తింపు తెచ్చిందని నందమూరి తారక రామారావు అని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)ని స్థాపించి ఎన్టీఆర్ అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో నిలిచారని పేర్కొన్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినది ఎన్టీరామారావుని గుర్తు చేశారు. స్వర్గీయ ఎన్టీ ఆర్ గురుంచి ఆయన అందించిన సేవలు గురించి ఎంత చెప్పుకున్నా ఈ జన్మసరిపోదని ఆయన కొనియాడారు. ప్రజలకోసం ఏ ఉద్దేశంతో అయితే పార్టీపెట్టారో వాటిను తూచా తప్పకుండా అమలు పరుస్తూ ఆయన ఆశయాలను సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు.

JR NTR: ఎన్టీఆర్ కు నివాళుర్పించిన జూనియర్‌ ఎన్టీఆర్‌,ఇతర కుటుంబ సభ్యులు

ఖ్యాతి

చిన్ననాటినుంచి ఆయన సినిమాలు ఆయన ప్రజలకు అందించిన మంచిపనులు చూసి పెరిగానని సీనీదర్శకుడు అన్న వీరాభిమాని వైవీఎస్ చౌదరి((YVS Chowdhury)) అన్నారు. పురాణపాత్రల్లో నటించి ప్రజల గుండెల్లో దేవుడిగా ఇప్పటికీ ఉన్నారంటే ఆయన ఖ్యాతి అజరామమని కొనియాడారు. అన్నా అనే పదానికి నిర్వచనం ఎన్టీఆర్ నాటినుంచే వచ్చిందని గుర్తు చేశారు.

Read Also: Narendra Modi: ఎన్టీఆర్ కు నరేంద్ర మోదీ ఘన నివాళి

#NandamuriTarakaRamarao #NTR102ndBirthAnniversary #RememberingNTR Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.