జయం రవి – కెనీషా ఆలయ దర్శనంపై వివాహ వదంతులు: కోలీవుడ్‌లో మరోసారి చర్చాస్పదం
కోలీవుడ్‌లో ప్రముఖ నటుడు Jayam Ravi, నటి కెనీషా మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల చెన్నైలోని ప్రసిద్ధ మురుగన్ ఆలయాన్ని ఈ జంట కలిసి సందర్శించగా, ఆలయంలో పూల దండలతో దిగిన వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు, జనం, కోలీవుడ్ వర్గాలు — వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారేమోనని ఊహాగానాలు మొదలుపెట్టారు.
ఆలయ పూజారులతో కలిసి మెడలో పూల దండలు ధరించిన జయం రవి, కెనీషాల చిత్రాలు ఈ వదంతులకు మరింత బలం చేకూర్చాయి.
ముఖ్యంగా, ఏ సందర్భంలో ఆలయాన్ని సందర్శించారన్న స్పష్టత లేకపోవడంతో ఈ విషయమై చర్చ మరింత వేడెక్కింది.
రవి మోహన్ స్టూడియోస్ ఆవిష్కరణ నేపథ్యంలో మురుగన్ ఆలయ సందర్శన
జయం రవి గురువారం తన కొత్త నిర్మాణ సంస్థ ‘రవి మోహన్ స్టూడియోస్’ లోగోను అధికారికంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ముందు ఆయన, కెనీషాతో కలిసి చెన్నైలోని మురుగన్ ఆలయాన్ని సందర్శించారు.
పూజల అనంతరం దిగిన ఫోటోలే ఇప్పుడు వివాహ వదంతులకు కారణమవుతున్నాయి. ముక్యంగా పూల దండలు ధరించడం తమిళ సాంప్రదాయంలో వివాహ సూచకంగా భావించబడుతుంది.
ఇదే కారణంగా ఫోటోలను చూసిన అభిమానులు, మీడియా వర్గాలు పెళ్లి జరిగిందా? అనే ప్రశ్నను విస్తృతంగా చర్చించసాగారు.
విడాకుల ప్రకటన తరువాత పెరుగుతున్న ఉత్కంఠ
జయం రవి గతేడాది తన భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన వ్యక్తిగత జీవితం చెన్నై ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
కొంతకాలంగా కెనీషాతో జయం రవికి సన్నిహిత సంబంధం ఉందన్న వార్తలు చెన్నై సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి.
ఇటీవల జరిగిన ఓ పెళ్లి వేడుకకు ఈ జంట కలిసి హాజరయ్యారు. ఆ సంఘటన తరువాత వీరి మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌పై సందేహాలు మరింత బలపడిన విషయం తెలిసిందే.
ఆర్తి-జయం రవి వివాదం: సోషల్ మీడియాలో మాటల యుద్ధం
జయం రవి-ఆర్తి విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో ప్రాసెస్‌లో ఉంది. ఈ వ్యవహారం తీవ్రంగా వైరల్ అయిన సమయంలో ఆర్తి సోషల్ మీడియాలో పలు ఎమోషనల్ పోస్టులు చేసి తనకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.
ఆమె తన భర్త నుంచి నెలకు రూ.40 లక్షల భరణం ఇప్పించాలని కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసినట్లు సమాచారం.
మరోవైపు, జయం రవి కూడా స్పందిస్తూ, “ఆర్తి తనను ఎమోషనల్‌గా నియంత్రించేది, ఒత్తిడికి గురిచేసేది” అంటూ ఆరోపణలు చేశాడు.
వీరి మధ్య జరిగిన ఈ సోషల్ మీడియా మాటల యుద్ధం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆలయ సందర్శన నేపథ్యంలో ఈ వివాదం మరలా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.
వాస్తవం బయటపడే వరకు ఉత్కంఠ కొనసాగేనా?
జయం రవి – కెనీషా మధ్య నిజంగా ఏమైనా జరుగుతోందా? పెళ్లి జరిగిందా లేదా అన్నది మాత్రం అధికారికంగా ఎవరూ స్పష్టం చేయలేదు.
ఈ విషయంలో ఇద్దరూ మౌనం పాటించడం కూడా అనుమానాలకు తావిస్తోంది. సినీ అభిమానులు, సోషల్ మీడియా వేదికలు, మీడియా సంస్థలు – అందరూ ఒక్కటే ప్రశ్న వేస్తున్నారు: “వీరి మధ్య ఉన్నది భక్తి యాత్రా లేక జీవిత కొత్త అధ్యాయమా?” జయం రవి త్వరలో ఓ అధికారిక ప్రకటన చేయనున్నారా అన్న దానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.
Read also: Bunny Vas: ఆందోళనలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల భవిత – బన్నీ వాస్