📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Actor: తన వివాహ బంధాన్ని ఎందుకు వదులుకున్నాడో క్లారిటీ ఇచ్చిన జయం రవి

Author Icon By Anusha
Updated: May 15, 2025 • 5:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ తమిళ నటుడు జయం రవి,తమిళ చిత్రపరిశ్రమలో అగ్ర హీరోలలో జయం రవి ఒకరు. ఓవైపు వరుస సినిమాలతో అలరిస్తున్న జయం రవి(Jayam Ravi), ఆయన భార్య ఆర్తి మధ్య కొంతకాలంగా విడాకుల వివాదం ముదురుతోంది. ఈ వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉండగా, ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా, తనపై ఆర్తి చేసిన ఆరోపణలను ఖండిస్తూ, ఆమె తనను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వేధించిందని ఆరోపిస్తూ జయం రవి గురువారం ఓ సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. ఈ లేఖ ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.గతంలో జయం రవి తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అలాగే ఇటీవల జయంరవి, కెనీషాతో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్(Rumors) వినిపిస్తున్నాయి. ఇటీవలే నిర్మాత గణేష్ ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు సింగర్ కెనిషాతో కలిసి జయం రవి హాజరయ్యాడు. వీరిద్దరికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.ఈ వార్తల నేపథ్యంలో, ఆర్తి ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో జయం రవిపై పలు ఆరోపణలు చేశారు. ముఖ్యంగా, జయం రవి తన పిల్లలను పట్టించుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు.

తెలియని

ఈ ఆరోపణలపై జయం రవి తీవ్రంగా స్పందించారు. గురువారం విడుదల చేసిన నాలుగు పేజీల లేఖలో ఆర్తి చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని కొట్టిపారేశారు. కెనీషా(Kenisha) ఎంతో మంచి వ్యక్తి అని, ఆమెకు గౌరవ, మర్యాదలు దక్కాలని అన్నారు.మానంగా ఉండడం అంటే అది నా అసమర్థత కాదు. నా ప్రశాంతమైన జీవితం కోసమే నేన మౌనంగా ఉన్నాను.నా గురించి ఏమీ తెలియని వ్యక్తులు నా ప్రశాంతతను ప్రశ్నిస్తే నేను మాట్లాడవలసి వస్తుంది. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే నా సొంత కృషి మాత్రమే కారణం. నా కీర్తిని తమ మటాలతో తగ్గించడానికి ప్రయత్నిస్తే నేను ఎప్పటికీ అనుమతించను. ఇది ఆట కాదు. నా జీవితం. నా జీవితానికి సరైన న్యాయం కోసం నేను ఎదురుచూస్తున్నాను.అలాగే, ఆర్తి(Aarthi)తో తన వైవాహిక జీవితం ఇబ్బందిగా ఉండేదని,నా తల్లిదండ్రులను కలవడానికి కూడా నాకు అనుమతి లేకుండా పోయింది.  ఇప్పుడు విడిపోవడంతో స్వేచ్ఛ లభించినట్లు భావిస్తున్నానని రవి తెలిపారు.ఈ వైవాహిక జీవితాన్ని నేనే వదిలేయాలని నేను నిర్ణయించుకోలేదు. కానీ ఆ నిర్ణయంవైపు వెళ్లాల్సి వచ్చింది.నేను మౌనంగా ఉండటం వల్ల చాలా నిందలు ఎదుర్కొంటున్నాను. ఒక తండ్రిగా నా బాధ్యతను నిర్వర్తించడం లేదని వాళ్లు నన్ను నిందిస్తున్నారు. ఈ ఆరోపణలను నేను పూర్తిగా ఖండిస్తున్నాను. నేను ఎప్పుడూ సత్యాన్ని నమ్ముతాను. దీనికి సరైన న్యాయం జరిగే వరకు నేను వేచి ఉంటాను. నాకు చాలా బాధ కలిగించే విషయం ఏమిటంటే నా పిల్లలను సానుభూతి కోసం ఉపయోగించుకోవడాన్ని నేను అంగీకరించలేను. నేను నా పిల్లలను ఎప్పుడూ వదులుకోలేదు. నేను వదులుకోను. ఒక తండ్రిగా ఎప్పుడు అండగా ఉన్నాను ” అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు.

Read Also: Marana Mass Movie: మరణ మాస్ (సోనీ లివ్) మూవీ రివ్యూ

#CelebrityNews #JayamRavi #JayamRaviSpeaks #JayamRaviStatement #TollywoodNews Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.