Jamie Lever: నా బాల్యం ఒక పీడకల..జానీ లివర్ కుమార్తె

Read Time:  1 min
Jamie Lever: నా బాల్యం ఒక పీడకల..జానీ లివర్ కుమార్తె
FONT SIZE
GET APP

బాలీవుడ్‌ నటుడు జానీ లివర్ కుమార్తె, నటి జామీ లివర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. హిందీలో పలు సినిమాలు చేసిన జామీ, గత ఏడాది అల్ల‌రి న‌రేష్ న‌టించిన ‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అయితే జానీ లీవర్ కుమార్తె జామీ లీవర్ తన చిన్న వయస్సులో ఎదుర్కొన్న భయానక అనుభవాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వివరించింది.నాకు 10 ఏండ్లు ఉన్న‌ప్పుడు స్కూల్ అయిపోగానే కారులో కూర్చున్నాను. తన సోదరుడు జెస్సీ(Jessie) కోసం డ్రైవర్ బయట ఎదురుచూస్తున్నాడు.ఈ సమయంలోనే ఒక వ్యక్తి కారు దగ్గరకు వచ్చి తనను చూస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. కారు డోర్ తీసి లోపలికి వస్తే తన పరిస్థితి ఏంటని భయంతో వణికిపోయాను. వెంటనే కారు డోర్ లాక్ చేసి, ఆ వ్యక్తిని చూడనట్లే ఉన్నానని దాంతో అతడు కాసేపటికి వెళ్లిపోయాడని జామీ(Jamie Lever) తెలిపింది. అంతేకాకుండా, తమ స్కూల్ బస్ డ్రైవర్ కూడా తమతో మర్యాదగా ప్రవర్తించేవాడు కాదని, ఎప్పుడూ ఏదో ఒక విధంగా తాకాలని చూసేవాడని జామీ వివరించారు. “ఇదంతా ఒక పీడకలలా మర్చిపోవాలనుకునేదాన్ని. 

Jamie Lever: నా బాల్యం ఒక పీడకల..జానీ లివర్ కుమార్తె
Jamie Lever

తీవ్ర ప్రభావం

పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన వ్యక్తే ఇలా నీచంగా ఆలోచిస్తే ఏమనాలి?” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు తనపై తీవ్ర ప్రభావం చూపాయని, అందుకే అబ్బాయిలను తన జీవితంలోకి ఇన్‌వైట్ చేయాలంటే భయమేసిందని జామీ తెలిపారు. అయితే తనకు 20 ఏండ్లు ఉన్న‌ప్పుడు కేవలం ఒక్కరిని మాత్రమే డేటింగ్ చేశానని పేర్కొన్నారు. తనకు జరిగిన ఈ అనుభవాలను తన తల్లి సుజాతకు గానీ, తండ్రి జానీ లివర్‌(Johnny Lever)కు గానీ చెప్పుకోలేదని జామీ లివర్ వెల్లడించారు.

Read Also: Maganti Gopinath: మాగంటి గోపినాథ్ నిర్మాత‌గా ప‌లు సినిమాలు తీసారు.. అవేంటంటే?

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.