📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Jagamerigina Satyam Movie: జగమెరిగిన సత్యం మూవీ రివ్యూ

Author Icon By Anusha
Updated: April 18, 2025 • 4:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రవితేజ మేనల్లుడు అవినాశ్‌ వర్మ హీరోగా తెరకెక్కిన చిత్రం జగమెరిగిన సత్యం. తెలంగాణ గ్రామీణ ప్రాంతం నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు పాలె తిరుపతి దర్శకత్వం వహించాడు. విజయభాస్కర్‌ ఈ సినిమాకు నిర్మించాడు. అందరూ కొత్త వాళ్లతో తెలంగాణ పల్లెల్లో తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది.  అవినాశ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం.

కథ

తెలంగాణలోని ఓ చిన్న ఊరులో నివసించే సత్యం అనే యువకుడి చుట్టూ ఈ కథ నడుస్తోంది. అతని జీవితం సాదాసీదాగా కనిపించినా,అతనిలో ఆత్మవిశ్వాసం, ప్రేమ, బాధ, త్యాగం మిళితమై ఉంటాయి. సత్యం కథ కేవలం ఒక వ్యక్తి గాథ కాదు అది ఒక ఊరి జీవితం, ఒక భూమి మనసు.సత్యం చుట్టూ నడిచే పాత్రలన్నీ మనం ఎక్కడో ఓ మూల చూసినట్టే ఉంటాయి. చిన్న చినమ్మతో అతని బంధం, గ్రామంలోని రాజకీయాలు, మనిషి విలువలపై వచ్చిన సవాళ్లు ఇవన్నీ కథలో బలంగా రూపుదిద్దుకున్నాయి.ఫస్టాఫ్‌లోని ప్రతి సీన్‌లోనూ ఊరి వాతావరణం, భాష, ఆచారాలు చూపించిన విధానం తెలంగాణ మట్టి వాసనను చూపిస్తాయి. సహజమైన పల్లె హాస్యంతో పాటు హృదయాన్ని తాకే భావోద్వేగ సన్నివేశాలతో ప్రథమార్ధం నడుస్తుంది. సెకండాఫ్‌లో కథ ఎమోషనల్‌గా మలుపు తిరుగుతుంది. సత్యం జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు,చివరికి ఊరిని ఒక కొత్త దిశలో తీసుకెళ్లే అతని కృషిని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు.క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ హైపాయింట్ సినిమాకు హృదయం లాంటి భాగం. సత్యం ఏడిచినప్పుడు థియేటర్‌లో ప్రతి ఒక్కరు ఏడుస్తారు. అంతటి బలమైన భావోద్వేగంతో కథ ముగుస్తుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు చివరికి థియేటర్ బయటకు వస్తున్నప్పుడు రెండు కన్నీటి చుక్కలతోనే వెళతాడు.

కథనం

“జగమెరిగిన సత్యం” సినిమా ఓ జీవన చిత్రణ. ఇందులో గ్లామర్ ఉండకపోవచ్చు, కానీ నిజాయితీ మాత్రం వెన్నుదన్నుగా ఉంది. కథ, పాత్రలు, నటన, సినిమాటోగ్రఫీ అన్నీ సహజత్వంతో నిండిపోయి ఉంటాయి. సినిమాలో ప్రతి ఒక్కరిలో మన ఊరి మనిషిని చూస్తాం. ఈ సినిమాతో రవితేజ మేనల్లుడు అవినాశ్‌ వర్మ హీరోగా పరిచయమయ్యాడు. చిన్న చిన్నమ్మ పాత్ర సినిమాకే హైలెట్‌గా చెప్పొచ్చు. సత్యం పాత్రలో ఆయన మంచి భావోద్వేగాన్ని పలికించాడు. విజువల్స్‌, డైలాగులు బాగున్నాయి. అయితే కొన్నిచోట్ల కథనం నెమ్మదిగా సాగుతుంది. దీంతో ప్రేక్షకుడు బోరింగ్‌గా ఫీలవుతాడు. దర్శకుడు పాలె తిరుపతికి ఇది మొదటి సినిమా అయినా అద్భుతంగా తెరకెక్కించాడు. ఇది డైరెక్టర్‌కు బెస్ట్‌ డెబ్యూ అని చెప్పొచ్చు. పాటలు, బీజీఎం ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకు అంతా కొత్త వాళ్లే అయినప్పటికీ ప్రొడ్యూసర్‌ వాళ్లపై నమ్మకంతో బాగానే ఖర్చు పెట్టాడు.

Read Also: Dia Mirza: కాఫిర్ సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేసిన దియా మిర్జా

#JagameriginaSatyam #JagameriginaSatyamReview #MovieReview #TeluguCinema #TollywoodMovie Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.