📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Ivana: మొదటి తెలుగు సినిమాతోనే హిట్ కొట్టిన ఇవానా

Author Icon By Anusha
Updated: June 15, 2025 • 3:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీవిష్ణు హీరోగా నటించిన”సింగిల్” (Single) సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. కుటుంబ భావోద్వేగాలతో పాటు యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా హీరో శ్రీవిష్ణు నాచురల్ పెర్ఫార్మెన్స్‌కు తోడు కథలో వాస్తవికత, హృదయాన్ని తాకే భావోద్వేగాలు సినిమా విజయానికి కీలకంగా నిలిచాయి.ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఇవానా అందంతోనే కాదు, నటనతో కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

నాచురల్ పెర్ఫార్మెన్స్‌

కథానాయికల కంటే

ఇప్పటికే త‌మిళ చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన ఇవానా (Ivana) టాలీవుడ్‌లో మాత్రం ఈ సినిమా ద్వారా అసలైన బ్లాక్‌బస్టర్ బ్రేక్ తెచ్చుకుందనే చెప్పాలి. సాధారణంగా గ్లామర్‌ పాత్రలకే పరిమితమవుతూ ఉండే కథానాయికల కంటే భిన్నంగా, “సింగిల్” సినిమాలో ఇవానా క్యారెక్టర్‌కు డెప్త్ ఉండడం ఆమెకు అదృష్టంగా మారింది. ఎమోషనల్ సీన్స్, హాస్యంతో పాటు రొమాంటిక్‌ ట్రాక్ కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి.

డబ్ అయ్యి

తమిళ్ లో లవ్ టుడే సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యి మంచి హిట్ గా నిలిచింది.సింగిల్ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.ప్రస్తుతం సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది ఇవానా. ఇక ఇప్పుడు ఈ చిన్నదానికి తెలుగులో క్రేజీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.  

ఆసక్తికర కామెంట్స్

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇవానా మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. చిన్నతనంలో హైట్ (Height) విషయంలో చాలా మంది ఏడిపించేవారు అని తెలిపింది. చిన్నప్పుడు నేను హైట్ తక్కువగా ఉండటంతో చాలా అవమానాలు, రిజక్షన్స్ ఎదుర్కొన్నా. స్కూల్‌లో నన్ను ఫ్రెండ్స్ ‘పొట్టి’ అని ఏడిపించేవారు అని తెలిపింది.

సినిమాల పై

వాళ్ల మాటలు చాలా బాధపెట్టేవి దాంతో నేను చదువు పై పెద్దగా దృష్టి పెట్టలేకపోయాను అని తెలిపింది. ఇక చిన్న వయసునుంచే సినిమాల పై ఇంట్రెస్ట్ ఉండేది అని చెప్పుకొచ్చింది. ఇవానాకు తెలుగులో ‘హ్యాపీడేస్’ అంటే చాలా ఇష్టమట. ఈ సినిమా సాంగ్స్ తన ఫెవరెట్ అని తెలిపింది అని చెప్పుకొచ్చింది.అలాగే ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun).

వరుసగా అవకాశాలు

ఇక ఈ చిన్నదనికి ఇప్పుడు వరుసగా అవకాశాలు అందుకుంటుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. సోషల్ మీడియా (Social media) లో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది తన ఫొటోలతో ఆకట్టుకుంటుంది. 

Read Also: 8 Vasantalu Movie: 8 వసంతాలు ట్రైల‌ర్‌ చూసారా?

#Ivana #SingleMovie #SriVishnu #TeluguCinema Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.