పెళ్లి, విడాకులు, అనారోగ్యం కారణాలతో సమంత కెరీర్ స్పీడ్ తగ్గింది. ఈ నేపథ్యంలోనే నిర్మాతగా మారి ఇటీవలే ‘శుభం’ సినిమాని నిర్మించింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో సామ్ మాట్లాడుతూ తనకు తెలుగు సినిమాల్లో నటించాలని ఉందని, అయితే సరైన కథలు రావడం లేదని చెప్పుకొచ్చింది. మంచి లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ వస్తే తప్పకుండా నటిస్తానని తెలిపింది. ఈ క్రమంలోనే సమంతతో సినిమా చేసేందుకు గురూజీ ముందుకొచ్చారట. తనను అవాయిడ్ చేస్తోన్న హీరోలపై ప్రతీకారం తీర్చుకునేందుకు త్రివిక్రమ్ సమంతతో లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ చిత్రాల్లో సామ్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే .ఈ మూడూ బ్లాక్‌బస్టర్సే. 2016లో వచ్చిన ‘అఆ’ తర్వాత సమంత(Samantha) ఆయన డైరెక్షన్లో నటించలేదు.రచయితగా ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకు పనిచేసి మాటల మాంత్రికుడిగా ప్రిసిద్ధి చెందాడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas). డైరెక్టర్‌గానూ ఎన్నో విజయవంతమైన సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్ హోదా తెచ్చుకున్నాడు. మహేశ్‌బాబుతో తీసిన ‘గుంటూరుకారం’ సినిమా గతేడాది సంక్రాంతికి రిలీజై విజయం సాధించింది. అయినప్పటికీ ఆయన ఏడాది కాలంగా మరో సినిమాను లైన్లో పెట్టలేకపోయారు. ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్‌తో చేయాల్సి ఉండగా అట్లీ ప్రాజెక్టు(Attlee Project) కారణంగా వీరిద్దరి సినిమా అటకెక్కింది. ఆ తర్వాత ధనుష్‌కి కథ వినిపించారని, ఆయన ఓకే చెప్పడంతో ఇద్దరి కాంబినేషన్లో ప్రాజెక్ట్ మొదలుకానుందని వార్తలొచ్చినా దానిపై ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో అసలు గురూజీ దారెటో తెలియక ఆయన అభిమానులు తికమకపడుతున్నారు. ఇంత పెద్ద డైరెక్టర్‌తో సినిమా చేయడానికి తెలుగులో హీరోలే కరువయ్యారా? అని చాలామంది సెటైర్లు వేస్తున్నారు.
ఎంటర్‌టైనర్
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవలే వెంకటేష్‌తో ఓ ప్రాజెక్టు ఓకే చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట. దీన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం(Banner of Haarika and Hassine Creations)పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్. వెంకీ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా పని చేసిన సంగతి తెలిసిందే. అయితే త్రివిక్రమ్ దర్శకుడిగా మారాక ఇన్నేళ్లకు వెంకటేశ్‌తో సినిమా తీస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. వెంకటేష్ కాల్షీట్లు ఖరారు కాగానే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈలోగా సామ్ కోసం గురూజీ ఓ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ తయారు చేసే పనిలో ఉన్నారట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కే బన్నీ, అట్లీ మూవీ పూర్తి కావడానికి చాలా టైమ్ పట్టే సమయముంది. ఈ గ్యాప్‌లో వెంకీతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్(Family entertainer), సమంతతో లేడీ ఓరియెంటెడ్ మూవీ తీయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేసుకున్నారట.బన్నీ డేట్స్ ఇచ్చే టైమ్‌కి ఈ రెండు సినిమాలు పూర్తి చేసి రెడీ ఉండాలన్నది గురూజీ ప్లాన్‌గా తెలుస్తోంది.
Read Also: Ram Charan : లండన్‌లో రామ్‌చరణ్‌ను కలిసిన ప్రఖ్యాత బాక్సర్ జూలియన్ ఫ్రాన్సిస్