📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Latest News: Idli Kottu Movie: ఇడ్లీ కొట్టు మూవీ రివ్యూ

Author Icon By Anusha
Updated: October 1, 2025 • 2:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులు ఎప్పుడూ కొత్త కథల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన కథను తెరపైకి తీసుకురావడానికి హీరో ధనుష్ సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం “ఇడ్లీ కొట్టు” (Idli Kottu Movie). పేరు విన్న వెంటనే ఒక సాధారణ భోజనశాల గుర్తుకు వస్తుంది. కానీ ఈ సినిమా మాత్రం ఒక కుటుంబాన్ని నిలబెట్టే కలల, కష్టాల, ఆశయాల ప్రతీకగా నిలుస్తుంది.

Nayanthara: మన శంకర వరప్రసాద్‌గారు సినిమా నుంచి కొత్త పోస్ట‌ర్‌ విడుద‌ల

మురళి అనే పాత్ర జీవితం మొత్తం ఈ “ఇడ్లీ కొట్టు” చుట్టూనే తిరుగుతుంది. తన తల్లిదండ్రుల కలలు, ఆశయాలు ఈ కొట్టులోనే దాగి ఉంటాయి. అతనికి ఇది కేవలం వ్యాపార స్థలం కాదు, తన కుటుంబ గౌరవానికి నిలువెత్తు సాక్ష్యం. అందుకే ఈ చిన్న హోటల్‌ (Hotel) అతనికి అమ్మలాంటిది, నాన్నలాంటిది, ఇంటి వారసత్వం లాంటిది.

కథలో ప్రధాన సంఘర్షణ కూడా ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఒక సాధారణ మనిషి కష్టపడి నిలదొక్కుకున్న చిన్న ఇడ్లీ కొట్టుపై బయటివారు కన్నేశారంటే? దాన్ని చేజార్చుకునే పరిస్థితి వచ్చినప్పుడు అతను ఎలా స్పందిస్తాడు? సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో హీరోలు గట్టి ప్రతీకారం తీర్చుకోవడం, హింసకు దిగడం చూస్తాం. కానీ “మురళి” మాత్రం వేరే దారిని ఎంచుకుంటాడు. తండ్రి బోధించిన అహింసా మార్గాన్ని ఆశ్రయించి, హింస లేకుండా తన కలల సౌధాన్ని కాపాడుకుంటాడు. ఇదే ఈ కథకు ప్రధాన బలం.

కథ

శంకరాపురం అనే చిన్నగ్రామంలో ఈ ‘ఇడ్లీ కొట్టు’ కథను మొదలు పెట్టాడు దర్శకుడు ధనుష్. శివకేశవుడు (రాజ్ కిరణ్)కి తన ఇడ్లీ (Idli) కొట్టు అంటే పంచ ప్రాణాలు. ఆ ఇడ్లీ కొట్టే తన తల్లి తనకి ఇచ్చిన ఆస్తి. దాన్నే దైవంగా భావిస్తూ.. ఊళ్లో వారికి రుచికరమైన ఇడ్లీ అందిస్తూ కడుపునింపుతుంటాడు.

శివకేశవుడు కొడుకు మురళి (ధనుష్) హోటల్ మేనేజ్‌మెంట్ (Hotel Management) చేసి ఉన్నత స్థితికి వెళ్లాలని అనుకుంటాడు. తన తండ్రి ఇడ్లీ కొట్టుకి ఊళ్లో మంచి పేరు ఉండటంతో ఆ పేరుతో మరిన్ని ఫ్రాంచైజీలతో విస్తరించాలని పట్టుపడతాడు. తన చేత్తో ఇడ్లీ వేయడానికి ఇష్టపడని శివకేశవుడు.. ఫ్రాంచైజీలు పెట్టడానికి ఒప్పుకోడు.

దాంతో మురళి.. తండ్రి దగ్గరే ఉంటే తాను కూడా ఇడ్లీలు వేసుకుని బతకాలనే ఉద్దేశంతో కన్నవాళ్లని వదిలేసి విదేశాలకు వెళ్లిపోతాడు. అక్కడ విష్ణు వర్థన్ (సత్యరాజ్)‌కి సంబంధించిన హోటల్స్‌ (Hotels) లో పనిచేసి వాళ్ల కంపెనీని లాభాల బాటపట్టిస్తాడు.

Idli Kottu Movie

కథనం

మురళి తమ వద్దే ఉంటే.. తమ కంపెనీకి తిరుగుఉండదనే ఉద్దేశంతో తన కూతురు మీరా (షాలినీ పాండే)ని ఇచ్చి పెళ్లి చేయాలని పెళ్లి ఫిక్స్ చేస్తాడు విష్ణు వర్థన్. ఆ పెళ్లి విష్ణు వర్థన్ కొడుకు అశ్విన్ (అరుణ్ విజయ్)కి ఇష్టం ఉండదు.

తన కంపెనీలో తనకంటే మురళికి ఎక్కువ పేరు రావడాన్ని సహించలేకపోతాడు అరుణ్. చుట్టూ కోట్ల ఆస్తులు.. పేరు, హోదా అన్నీ ఉన్నా కన్నవాళ్లు లేని బాధని భరించలేకపోతుంటాడు మురళి. సరిగ్గా మీరాతో పెళ్లి టైమ్‌కి మురళి (Murali) తండ్రి చనిపోతారు. అతను ప్రాణంగా చూసుకున్న ‘ఇడ్లీ కొట్టు’ మూతపడుతుంది.

మురళి తిరిగి తన స్వగ్రామం వచ్చిన తరువాత తన తండ్రి ఆశయం అయిన ‘ఇడ్లీ కొట్టు’ని ఏ విధంగా నిలబెట్టాడు? మురళికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి.. తన తండ్రి పేరుతో పాటు వారసత్వాన్ని నిలబెట్టడం కోసం ఎలాంటి పోరాటం చేశాడు? అతని పోరాటంలో కళ్యాణి (నిత్యామీనన్) అందించిన ప్రోత్సాహం ఏంటి? అన్నదే మిగిలిన ‘ఇడ్లీ కొట్టు’ కథ.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

ahimsa path Breaking News Dhanush family legacy Idli Kottu idli shop Inspirational Story latest news meaningful cinema simple life Tamil Cinema Telugu News village inspiration

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.