📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి

Nazriya Nazim: రియాక్ట్ అవ్వకపోవడంతో చాలా రిగ్రేట్ ఫీల్ అయ్యా: నజ్రియా

Author Icon By Anusha
Updated: April 17, 2025 • 2:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నజ్రియా రాజా రాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. 2014లో అంజలి రచన దర్శకత్వం వహించిన బెంగుళూరు డేస్ చిత్రంలో నజ్రియా నటించింది. ఇందులో ఫహద్ ఫాజిల్ నజ్రియా భర్తగా నటించాడు. ఈ సినిమా సమయంలోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. దాని తర్వాత నిజ జీవితంలో భార్యాభర్తలుగా మారిపోయారు.పెళ్లి తర్వాత ఈ జంట తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. నజ్రియా మలయాళంలో సినిమాలు చేస్తుంటే ఫహద్ ఫాజిల్ రీసెంట్ గా తెలుగులో పుష్ప 2తో భారీ హిట్ అందుకున్నాడు.

అందరికీ సారీ

మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళ బ్యూటీ నజ్రియా నాజిమ్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోయింది. గత ఏడాది డిసెంబర్‌లో చివరగా పోస్ట్ వేసింది. తన చిత్రం సూక్ష్మదర్శిని బ్లాక్ బస్టర్ అయినా కూడా ఎవరి కాల్స్‌కు స్పందించలేదట. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సినీ ఫ్యామిలీ నుంచి ఎవ్వరు ఫోన్ చేసినా కూడా స్పందించలేదట. ఎవ్వరికీ అందుబాటులో లేకుండా పోయిందట. ఈ విషయాలన్నీ చెబుతూ అందరికీ సారీ చెప్పింది నజ్రియా. అందరినీ క్షమించమని కోరుతూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.నజ్రియా ఇన్ని రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉందట. అస్సలు ఎవ్వరి ఫోన్‌లు లిఫ్ట్ చేయలేదట. తాను ఇన్ని రోజులుగా కాస్త డిప్రెషన్‌లో ఉందట. కొన్ని గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొందట. అందుకే ఎవ్వరికీ కాంటాక్ట్‌లో లేదట. తన సూక్ష్మదర్శిని సినిమా హిట్ అయిన తరువాత ఎంతో మంది ప్రశంసించేందుకు ఫోన్లు కూడా చేశారట. కానీ ఎవ్వరి ఫోన్లు కూడా లిప్ట్ చేయలేదట. దీంతో అందరికీ సారీ చెబుతూ నజ్రియా పోస్ట్ చేసింది.

విడాకుల పోస్ట్

ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫాలోవర్లు, అభిమానులకు సారీ అంటూ నజ్రియా వేసిన పోస్ట్ అందరినీ కదిలిస్తోంది. అసలు మీకు ఏమైంది? ఎందుకు డిప్రెషన్‌లోకి వెళ్లారు?అసలు ఏం జరిగింది? అంటూ కామెంట్లు పెడుతున్నారు. సడెన్‌గా ఈ పోస్ట్ చూసి విడాకుల పోస్ట్ అయి ఉంటుందేమో అని అనుకుని భయపడ్డా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా నజ్రియా ఇలా సైలెంట్‌గా ఉండటంతో విడాకుల ఇష్యూ జరుగుతుందేమో అని రూమర్లు కూడా వచ్చాయి.నజ్రియా 30వ బర్త్ డే వేడుకల్ని, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఇలా అన్నింటినీ మిస్ చేశానని, సారీ అంటూ అందరికీ చెప్పింది నజ్రియా. ఎవ్వరితోనూ కాంటాక్ట్‌లో లేకపోవడం, ఎవ్వరికీ రియాక్ట్ అవ్వకపోవడంతో తాను చాలా రిగ్రేట్ ఫీల్ అయ్యానని నజ్రియా తన ప్రెస్ నోట్‌లో తెలిపింది. నజ్రియా, ఫాహద్ ఫాజిల్ మధ్యలో ఏం జరిగి ఉంటుందో అని అంతా అనుకుంటున్నారు. వారిద్దరికీ పర్సనల్‌గా ఎలాంటి ఇబ్బంది లేదని నజ్రియా నాజిమ్ ఫాహద్ అని పోస్ట్ చూస్తేనే అర్థం అవుతోంది.

Read Also: Odela 2 Movie: ఓదెల 2 మూవీపై నెటిజన్లు ఏమంటున్నారంటే..

#ApologyNote #MissingInAction #NazriyaNazim #NazriyaReturns #PressNote #SocialMediaSilence Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.