📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Actor: నేను ప్రతీది డబ్బు కోసమే చేయను: విజయ్ సేతుపతి

Author Icon By Anusha
Updated: May 21, 2025 • 12:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం ఏస్ అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాడు. మామూలుగా విజయ్ సేతుపతి చిత్రం సైలెంట్‌గా థియేటర్లోకి వస్తాయి. మహారాజా వంటి చిత్రాలతో ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్ చేస్తుంటాడు. ఇక విజయ్ సేతుపతి తనకు నచ్చిన కథల్ని, పాత్రల్ని చేసుకుంటూ వెళ్తున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏస్ మూవీ ప్రమోషన్స్‌(Ace Movie Promotions)లో భాగంగా విజయ్ సేతుపతి తన కడైసై వ్యవసాయి (చివరి వ్యవసాయదారుడు) అనే సినిమా గురించి ప్రస్థావించాడు.కడైసై వ్యవసాయి (చివరి వ్యవసాయదారుడు) సినిమాకు డబ్బులు రాలేదని, అప్పుడు కేవలం 65 లక్షలే థియేటర్ల నుంచి వచ్చిందని, దానికి తానేమీ బాధపడలేదని అన్నాడు. ఎందుకంటే ఆ సినిమాను జనాలు ఇప్పుడు చూస్తున్నారని, చాలా సెలెబ్రేట్ చేస్తున్నారని, తనకు అది చాలని అన్నాడు. తాను ప్రతీది డబ్బు కోసమే చేయనని చెప్పుకొచ్చాడు. కొన్ని సార్లు మనం పెద్ద పెద్ద భారీ బడ్జెట్ చిత్రాలు చేసినా అవి వర్కౌట్ కాకపోవచ్చు కదా అని అన్నాడు.విజయ్ సేతుపతి తాను హిట్ దర్శకుడా, ఫ్లాప్ దర్శకుడా అని కూడా చూడడు. చెప్పే కథలో విషయం ఉందా? లేదా? అన్నదే చూస్తాడట. అందుకే పూరి జగన్నాథ్(Puri Jagannath) చెప్పిన కథకు విజయ్ ఇంప్రెస్ అయి డేట్లు ఇచ్చేశాడట. ఇప్పుడు విజయ్ సేతుపతి, పూరి కాంబినేషన్‌లో మూవీకి సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ మూవీకి కోసం సీనియర్లను పట్టుకొస్తున్నాడు పూరి. ఆల్రెడీ టబు ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్న సంగతి తెలిసిందే.

నమ్మకం

విజయ్ సేతుపతి ఏస్ మూవీని తెలుగులోకి శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి. శివ ప్రసాద్ తీసుకు వస్తున్నాడు. దర్శక, నిర్మాత బి. శివ ప్రసాద్ ఏస్ మీదున్న నమ్మకంతో తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ టీంతో నేడు ఓ స్పెషల్ ఈవెంట్‌ను కూడా ప్లాన్ చేశారు. నేటి సాయంత్రం జరిగే ఈవెంట్‌లో విజయ్ సేతుపతి(Vijay Sethupathi, రుక్మిణి వసంత్, యోగి బాబు సందడి చేసేలా ఉన్నారు. ఈ చిత్రం మే 23న గ్రాండ్‌గా తెలుగులో రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే.

Read Also: Saiyami Kher : కాస్టింగ్ కౌచ్ పై సంచలన ఆరోపణలు చేసిన సయామీ ఖేర్

#AceMovie #AcePromotions #KollywoodStar #VijaySethupathi #VijaySethupathiFans Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.