📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

HIT 3 Movie: ‘హిట్‌ 3’ సినిమా రివ్యూ

Author Icon By Anusha
Updated: May 1, 2025 • 2:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ గా శైలేష్ కొలను తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ హిట్ 3. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా హిట్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆసక్తి పెరిగిపోయింది. మరి హిట్ 3 ఆడియన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుందా ? నాని మరోసారి నిర్మాతగా సక్సెస్ అయ్యాడా? లేదన్నది రివ్యూ లో చూద్దాం.

కథ

విధి నిర్వహణ విషయంలో ఎంతకన్నా తెగించే పోలీస్‌ ఆఫీసర్‌ అర్జున్‌ సర్కార్‌ ఐపీఎస్‌(నాని). క్రిమినల్‌ అనేవాడు నేలలో ఆరడుగుల హోల్‌లో నైనా ఉండాలి. లేకపోతే పోలీస్‌ సెల్‌లోనైనా ఉండాలనే తత్వం అతనిది. ఒక క్రిమినల్‌ని చంపే క్రమంలో వందమంది అమాయకులు చచ్చినా తను కేర్‌ చేయడు. చేతికి దొరికిన క్రిమినల్స్‌కి నరకం చూపించి మరీ చంపుతాడు. ఇదిలావుంటే ఓ సైకో కిల్లర్‌ వరుసగా హత్యలు చేస్తూ పోలీసులకు తలనొప్పిగా మారతాడు. తాను చంపడమే కాక, ఓ వెబ్‌సైట్‌ని ఏర్పాటు చేసి, ఆ వెబ్‌సైట్‌ ద్వారా ఓ సైకో సామ్రాజ్యాన్నే క్రియేట్‌ చేస్తాడు. అమాయ‌కుల్ని పాశవికంగా చంపుతూ వీడియోలు తీసి ఆ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తుంటారు. దేశంలో ఉన్న సైకోలంతా ఈ వెబ్‌సైట్‌ మెంబర్లే. అలాంటి ఓ సైకో సామ్రాజ్యాన్ని నిర్వీర్యం చేసే బాధ్యతను అర్జున్‌ సర్కార్‌ తీసుకుంటాడు. మరి ఆ సైకో సామ్రాజ్యంలోకి అర్జున్‌ ఎలా ప్రవేశించాడు? ఏ విధంగా అక్కడ దుష్టసంహారం చేశాడు? అనేది మిగతా కథ.

కథనం

కమర్షియల్‌ సినిమాల విషయంలో కొత్త కథలను కోరుకోవడం ప్రేక్షకులకు ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యాశే అవుతుంది. కథ పాతదైనా దాన్ని కొత్తగా ఎలా ప్రజెంట్‌ చేశాడు. అనేది మాత్రమే ఇప్పుడు ముఖ్యం. ఈ విషయంలో దర్శకుడు శైలేష్‌ కొలను సక్సెస్‌ అయ్యాడనే చెప్పాలి. ఈ సినిమాకు కథనం హైలైట్‌. నాని పోషించిన అర్జున్‌ సర్కార్‌ పాత్ర అరెస్ట్‌ అవ్వడంతో ఈ సినిమా కథ మొదలైంది. అలా ఓ ప్రశ్నతో కథను మొదలుపెట్టి దానికి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు దర్శకుడు. ప్రథమార్ధం అంతా స్క్రీన్‌ప్లే బేస్డ్‌గా సినిమా సాగింది. స్ట్రయిట్‌ నేరేషన్‌లో కాకుండా, హాఫ్‌వేలో సినిమా మొదలుపెట్టి ప్రేక్షకుల మనసుల్లో ఏర్పడిన చిక్కుముళ్లను ఒక్కొక్కటి విప్పుతూ సెకండాఫ్‌ దాకా ఇంట్రస్టింగ్‌గా సినిమా నడిపించాడు. ఇక సెకండాఫ్‌ మొత్తం సినిమా స్ట్రయిట్‌ నేరేషన్‌. ఓ విధంగా 80లో చిరంజీవి నటించిన ‘కిరాతకుడు’ సినిమాను గుర్తు చేస్తుంది. విలన్‌ సామ్రాజ్యంలోకి హీరో ఒక్కడే అడుగుపెట్టడం అక్కడున్న రహస్యాలన్నింటినీ తెలుసుకునే క్రమంలో హీరో పలు ప్రమాదాల్లో ఇరుక్కోవడం అందులోంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు ఇవన్నీ నిజంగా మాస్‌ ప్రేక్షకులకు విజువల్‌ ఫీస్టే. అసలు అర్జున్‌ సర్కార్‌ క్యారక్టర్‌ ఇంట్రో నుంచే ఆ పాత్రపై ఆసక్తిని రేకెత్తించాడు దర్శకుడు శైలేష్‌ కొలను. క్రిమినల్స్‌తో తను గడిపే సన్నివేశాలు.క్రిమినల్స్‌ని తను చంపే సన్నివేశాలు నిజంగా ఆడియన్స్‌కి వణుకు పట్టిస్తాయి. ఓ వైపు శత్రు సంహారం భయంకరంగా జరుగుతుంటే మరోవైపు చాగంటిగారి ప్రవచనాలు వినిపించడం విభిన్నంగా ఉంది. మొత్తంగా శైలేష్‌ ‘హిట్‌’ మూడో భాగాన్ని కూడా జనం మెచ్చేలాగే తీశాడు. కానీ సినిమాలో హింస మరీ ఎక్కువైంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో అయితే తెర మొత్తం రక్తసిక్తమే. కానీ హీరో అలా స్పందిచడానికి బలమైన కారణం ఉండటం వల్ల ఆ హింస కూడా జనరంజకంగానే ఉందని చెప్పాలి. చివర్లో అడవి శేషు సడన్‌ ఎంట్రీకి మంచి స్పందన వచ్చింది. ఇక ‘హిట్‌ 4’ అంటూ కార్తీ ఎంటర్‌ అవ్వగానే థియేటర్‌ దద్దరిల్లిపోయింది.

Read Also: Actor: అజిత్ కి స్వల్ప గాయాలు ఆసుపత్రిలో చికిత్స

#Hit3 #HIT3Review #Nani #NaniAsArjunSarkar #TeluguCinema Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.