📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Thug Life Movie: ‘థగ్‌ లైఫ్‌’ మూవీ ట్రైలర్ చూసారా?

Author Icon By Anusha
Updated: May 18, 2025 • 12:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

త‌మిళ విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘థ‌గ్ లైఫ్. లెజెండరీ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్ లో ఈ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఇందులో శింబు, త్రిష, అశోక్ సెల్వన్, సన్యా మల్హోత్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 5వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్‌(Thug Life Movie Trailer) ను లాంచ్ చేసారు.”నువ్వు నా ప్రాణం కాపాడినవాడివి. యముడికి దొరక్కుండా వెనక్కి లాగినోడివి. నీ తలరాత నా తలరాత ఒకటిగా రాసినాడు. ఇక మీద నువ్వూ నేనూ ఒక్కటే చివరి వరకూ” అంటూ కమల్ ఇంటెన్స్ వాయిస్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ఆసక్తికరంగా ఆకట్టుకునేలా సాగింది. మణిరత్నం తన మార్క్ స్క్రీన్ ప్లేతో, పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా ‘థగ్ లైఫ్’ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. చీకటి సామ్రాజ్యాన్ని ఏలే ఓ నాయకుడు అతను పెంచి పోషించిన ఓ శిష్యుడు ప్రత్యర్థులతో ఆధిపత్య పోరు చివరకు పవర్ కోసం గురు శిష్యుల మధ్య యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది.

తదితరులు

ఇందులో కమల్ హాసన్ గాడ్ ఫాదర్ తరహా పాత్రలో తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఆయన క్యారక్టర్ ఎదిగే క్రమంలో విభిన్నమైన గెటప్స్, లుక్స్ తో అలరించారు. కమల్ ప్రేయసిగా త్రిష కృష్ణన్ నటించగా భార్య పాత్రను అభిరామి(Abhirami) పోషించింది. దత్త పుత్రుడిగా, ఆయనకు ధీటుగా నిలిచే పాత్రలో శింబు కనిపించారు. నువ్వూ నేనూ ఒక్కటే అనుకున్న వీరిద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడే విరోధులుగా ఎలా మారారు? అనే పాయింట్ ఆసక్తికరం.కమల్ గెటప్స్ చూస్తుంటే కొన్నేళ్లపాటు అజ్ఞాతంలో ఉండి, ఆ తరువాత శింబుపై ప్రతీకారం తీర్చుకోడానికి వచ్చినట్లు అనిపిస్తుంది.కమల్ హాసన్ – శింబుల మధ్య ఫైట్ సీన్స్ తో సహా, ప్రతీ సన్నివేశాన్ని మణిరత్నం(Maniratnam) చాలా బాగా చూపించారు. త్రిషకు ట్రైలర్ లో పెద్దగా ప్రాధాన్యత లేదు. అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి ఒక్కో షాట్ లో కనిపించారు. జోజూ జార్జ్, నాజర్, మహేష్ మంజ్రేకర్, మీర్జాపూర్ అలీ ఫజల్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ‘థగ్ లైఫ్’ ట్రైలర్ లో ఏఆర్ రెహమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్, రవి కె.చంద్రన్ విజువల్స్ హైలైట్ గా నిలిచాయి. ఇద్దరూ తమ క్యారెక్టర్స్ కి పూర్తిగా న్యాయం చేసారు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.ఓవరాల్ గా ‘థగ్ లైఫ్’ ట్రైలర్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసేలా ఉంది. 36 ఏళ్ల క్రితం వచ్చిన ‘నాయకుడు’ వంటి కల్ట్ క్లాసిక్ తర్వాత కమల్‌ హాసన్‌ – మణిరత్నం కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో ఇప్పటికే జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. రాజ్‌ కమల్‌ ఇంటర్నేషనల్‌ ఫిలింస్‌, మద్రాస్‌ టాకీస్‌ సంస్థ(Madras Talkies Company)లు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ లో హీరో నితిన్ తెలుగులో విడుదల చేయనున్నారు.

Read Also: Bakasura Restaurant Movie: ‘భకాసుర రెస్టారెంట్‌’ మూవీ ట్రైల‌ర్ విడుదల

#kamalhaasan #ManiRatnam #SilambarasanTR #SonyPictures #ThugLife Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.