📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

GV Babu: ‘బ‌ల‌గం’ న‌టుడు జీవీ బాబు ఇకలేరు

Author Icon By Ramya
Updated: May 25, 2025 • 11:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రంగస్థల దిగ్గజం జీవీ బాబు కన్నుమూత – తెలుగు నాటకరంగానికీ, చిత్రపరిశ్రమకీ తీరని లోటు

తెలుగు నాటకరంగంలో తనదైన ముద్ర వేసిన ప్రతిభావంతుడు, ‘బలగం’ సినిమాతో ప్రేక్షకుల మన్ననలు పొందిన నటుడు జీవీ బాబు ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయ‌న‌, వరంగల్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. రంగస్థల కళాకారుడిగా ఎన్నో దశాబ్దాలుగా కళాజీవిగా జీవించిన జీవీ బాబు, సినీ ప్రేక్షకులకు మాత్రం ‘బలగం’ చిత్రంతో పరిచయం అయ్యారు. ఆయ‌న మృతి వార్తతో కళాజగత్తు శోకసంద్రంలో మునిగిపోయింది.

‘బలగం’ దర్శకుడు వేణు స్పందన – జీవితాంతం నాటకరంగమే ఆయ‌న గమ్యం

జీవీ బాబు మృతి పట్ల ‘బలగం’ సినిమా మూవీ డైరెక్టర్ వేణు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. జీవీ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. “జీవీ బాబు గారు ఇకలేరు. ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోకే గడిపారు. చివరి రోజుల్లో ఆయనను బలగం మూవీతో వెండితెరకు పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అంటూ పోస్ట్ చేశారు. జీవీ బాబు మృతి పై సినీప్రముఖులు, బలగం మూవీ నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు.

బలగంలో ‘అంజన్న’గా జీవి బాబు – సహజ నటనకు జీనియస్

కాగా, రెండేళ్ల క్రితం విడుదలైన ‘బలగం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగమైన నటీనటులందరికీ మంచి పేరు వచ్చింది. చాలా మందికి మంచి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. కాగా, ఇదే బలగం సినిమాలో ప్రియదర్శికి చిన్నతాత అంజన్నగా అద్భతంగా నటించారు జీవీ బాబు. కథని ముందుకు తీసుకోవడంలో ఆయనదే కీలక పాత్ర. మన పల్లెటూర్లలో తాతలు ఎలా ఉంటారో అచ్చం అలాగే ఎంతో సహజంగా నటించి జీవీ బాబు మెప్పించారు. అలాంటి నటుడు మృతిచెంద‌డంతో ఇండ‌స్ట్రీలో విషాదం నెల‌కొంది.

సినీ, నాటక రంగ ప్రముఖుల శోక స్పందన

జీవీ బాబు మరణ వార్త తెలిసిన వెంటనే నాటకరంగానికి చెందిన పలువురు కళాకారులు, దర్శకులు, రచయితలు ఆయన పట్ల గాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సినిమా రంగానికీ ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశారు. రూటు నటనకు ప్రతిరూపంగా నిలిచిన బాబును కోల్పోవడం పట్ల వాళ్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

Read also: Preity Zinta: దేశభక్తిని చాటిన బాలీవుడ్ బ్యూటీ –సైన్యం కోసం ప్రీతి జింటా భారీ విరాళం

#AnjannaCharacter #BalagamActor #BalagamAnjanna #BalagamMovie #GVBabu #GVBabuPassesAway #NatakamLegend #TeluguActorDeath #TeluguCinema #TeluguTheatre #TheatreArtist #TributeToGVBabu Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.