📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Good Wife Series: గుడ్ వైఫ్ (JioHotstar) రివ్యూ

Author Icon By Anusha
Updated: July 5, 2025 • 2:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రియమణి ఒక లాయర్ పాత్రలో కనిపిస్తున్నారు

ప్రియమణి ఇటీవల కాలంలో ఓటీటీ వేదికగా దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా ‘ది ఫ్యామిలీ మేన్’ వంటి హిట్ సిరీస్‌తో ఆమెకు నేషనల్ రేంజ్‌లో గుర్తింపు వచ్చింది. ఈ సిరీస్‌లో మానస పాత్రతో ఆమె ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు. తెలుగులో ‘భామా కలాపం’ వంటి థ్రిల్లర్‌తోనూ మంచి స్పందన అందుకున్నారు.ఇప్పుడు ఆమె కొత్తగా నటించిన ‘గుడ్ వైఫ్’ సిరీస్‌ (JioHotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది లీగల్ డ్రామా. ఒరిజినల్‌గా అమెరికాలో వచ్చిన ‘ది గుడ్ వైఫ్’ సిరీస్‌కు ఇది ఇండియన్ అడాప్టేషన్. ఇందులో ప్రియమణి ఒక లాయర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఆమె భర్త ఒక ఐపీఎస్ ఆఫీసర్, అవినీతి కేసులో అరెస్టవడం తర్వాత ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయో, ఆమె ఎలా కోర్ట్ లో పోరాడుతుందో ఈ సిరీస్ కథాంశం.మరి ఈ సిరీస్ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

కథేంటంటే

అడిషనల్ అడ్వకేట్ జనరల్ గుణశీలన్ (సంపత్ రాజ్) ఓ సెక్స్ స్కాండల్, డ్రగ్స్ మాఫియా కేసులో ఇరుక్కుంటాడు. దీంతో అతను తన పదవికి రాజీనామా చేస్తాడు. ఆ తరువాత అతడ్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. గుణశీలన్ భార్య తరుణిక (ప్రియమణి) దాదాపు పదిహేనేళ్ల తరువాత మళ్లీ లాయర్ ప్రాక్టీస్ మొదలు పెడుతుంది. ఈ క్రమంలో తన మాజీ ప్రేమికుడు/స్నేహితుడు హరి దీపక్ (ఆరి అర్జునన్) ఇచ్చిన ఆఫర్‌ను ఓకే చేసి అతడి కంపెనీలో జాయిన్ అవుతుంది. ఏఎల్‌హెచ్ అనే ఫర్మ్‌లో తరుణిక (Tharunika) జాయిన్ అవుతుంది. పెద్ద పెద్ద కేసుల్ని డీల్ చేసే ఆ సంస్థలో తరుణిక తన ఉద్యోగాన్ని పదిలం చేసుకుంటుందా? జైలుకు వెళ్లిన భర్త కోసం భార్య చేసే ప్రయత్నాలు ఏంటి? అసలు భర్తను విడిపించుకునేందుకే మళ్లీ లా ప్రాక్టీస్ ప్రారంభించిందా? హరి దీపక్, తరుణికల మధ్య మళ్లీ పాత ప్రేమ చిగురిస్తుందా? గుణశీలన్ బయటకు వస్తాడా? అన్నది కథ.

Good Wife Series: గుడ్ వైఫ్ (JioHotstar)రివ్యూ

కథనం

ప్రియమణి నటించిన గుడ్ వైఫ్ సిరీస్‌ అమెరికన్ సిరీస్‌కు అడాప్షన్. అక్కడి పరిస్థితులు, అక్కడి మోడ్రన్ లైఫ్‌కు తగ్గట్టుగా ఉంటుంది. మన ఇండియాకు దీన్ని తీసుకు వస్తున్నప్పుడు ఇక్కడి ఎమోషన్స్, ఇక్కడి పద్దతులకు తగ్గట్టుగా ఉండాలి. ఇక్కడి ఆడియెన్స్ ఎమోషన్స్‌కు కనెక్ట్ అయ్యేలా సిరీస్‌ను మలచాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రయత్నం మాత్రం ఎక్కడా కూడా జరిగినట్టు అనిపించదు. ఏ ఒక్క పాత్రకి సరైన రూపం ఉండదు. ఏ ఒక్క సీన్‌కు కూడా దాని బ్యాక్ స్టోరీ, బ్యాక్ డ్రాప్ ఉండదు.అసలు ఇది కోర్ట్ డ్రామా (Court drama) అని తెలిసి, ఇక ఢీ అంటే ఢీ అనే వాదోపవాదాలు ఉంటాయి. ఎంగేజింగ్‌గా ఉంటుందని అంతా అనుకుంటారు. కానీ అలా అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఇందులో ఆరు ఎపిసోడ్స్‌ ఉంటే అందులో ఏ ఒక్క చోట కూడా ఇదిరా, కోర్టులో వాదనలు అంటే, అని అనిపించేలా ఒక్క సీన్ కూడా ఉండదు. ఇందులో కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఉండవు, ఉన్న రెండు, మూడు అంత ఎంగేజింగ్‌గా అనిపించవు.

సెకండాఫ్‌లో మరింత ఎక్కువగా ఉండేలా కనిపిస్తుంది

జైలుకు వెళ్లిన భర్త గురించి భార్య పట్టించుకుంటోందా? భర్తను నమ్ముతుందా? నమ్మడం లేదా? భర్తను వదిలేసిందా? అన్న క్లారిటీ చూసే ఆడియెన్స్‌కి కలగదు. భార్యభర్తల మధ్య అన్యోన్యత ఉందా? లేదా? మాజీ ప్రియుడ్ని తల్చుకుంటూ ఉంటోందా? పిల్లల కోసమే భర్తతో ఉంటోందా? అనే అనుమానాల్ని కలిగించేలా సాగుతుంది. ఏ ఒక్క పాత్రకి కూడా సరైన జస్టిస్ ఇవ్వలేదనిపిస్తుంది. గుణశీలన్ మంచివాడా? చెడ్డవాడా? అన్నది కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు.నటీనటులుగా ప్రియమణి (Priyamani) తన నటన, లుక్స్, గ్లామర్‌తో మెప్పిస్తారు. సంపత్ రాజ్‌కు స్పేస్ తక్కువగా అనిపిస్తుంది. కానీ ఉన్నంతలో ఓకే అనిపిస్తారు. ఆరి అర్జునన్ పాత్ర సెకండాఫ్‌లో మరింత ఎక్కువగా ఉండేలా కనిపిస్తుంది. ఈ ఫస్ట్ హాఫ్ వరకు ఆరి తన పాత్రకు న్యాయం చేశాడనిపిస్తుంది. ఉమర్, స్నేహ, అర్చన, పిల్లల పాత్రలు ఇలా అన్నీ కూడా ఓకే అనిపిస్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Oh Bhama Ayyo Rama: ‘ఓ భామ అయ్యో రామ’ ట్రైల‌ర్‌ విడుదల

#BhamaKalapam #DigitalEntertainment #IndianWebSeries #LegalDrama #OTTContent #OTTReview #OTTSeries #Priyamani #PriyamaniFans #PriyamaniOnOTT #TeluguActress #TeluguWebSeries #TheFamilyMan #TheGoodWife #WebSeriesIndia Ap News in Telugu Bhama Kalapam Breaking News in Telugu Google News in Telugu Indian legal drama Indian web series Latest News in Telugu latest OTT release OTT content Paper Telugu News Priyamani Priyamani digital series Priyamani in The Good Wife Priyamani OTT success Priyamani performance Telugu Actress Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Telugu web content The Family Man series The Good Wife review The Good Wife web series

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.