हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Garuda 2.0: ‘గరుడ 2.0’ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్!

Ramya
Garuda 2.0: ‘గరుడ 2.0’ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్!

క్రైమ్, మిస్టరీ, థ్రిల్.. ఓటీటీలో గరుడ 2.0 దుమ్ములేపుతోంది!

ఈ మధ్య కాలంలో ఓటీటీ వేదికగా విడుదలవుతున్న సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కథ, కథనంలో వింతత, పాత్రల మలుపులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కి ఇష్టపడే ప్రేక్షకులకు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వెలువడుతున్న చిత్రాలు సస్పెన్స్‌తో కూడిన ట్రీట్‌ని ఇస్తున్నాయి. అలాంటి చిత్రాల్లో తాజాగా ప్రేక్షకులను ఊపేసే సినిమా గరుడ 2.0. ఈ సినిమా ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ టాప్ ట్రెండింగ్ స్థానాన్ని దక్కించుకుంది.

తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి వచ్చిన కథ.. ఇప్పుడు ఓటీటీలో రిపీటవుతోంది విజయం!

గరుడ 2.0 అనే పేరుతో ఇప్పుడు తెలుగులో విడుదలైన ఈ చిత్రం, 2016లో తమిళంలో “ఆరతు సినమ్” పేరుతో విడుదలై మంచి హిట్ టాక్ సంపాదించింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత, అదే సినిమాను తెలుగు ప్రేక్షకుల కోసం “గరుడ 2.0” పేరుతో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ అభిమానుల మనసు దోచుకుంది. ఊహించని ట్విస్టులు, కట్టిపడేసే స్క్రీన్‌ప్లే, భావోద్వేగాలతో కూడిన కథా నిర్మాణం ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపింది. IMDBలో 6.8 రేటింగ్ దక్కించుకున్న ఈ సినిమా, తెలుగు వెర్షన్‌కి కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ అందిస్తోంది.

హనుమాన్ బ్యానర్‌పై విడుదల.. నటీనటుల ప్రదర్శన అద్భుతం

ఈ చిత్రాన్ని హనుమాన్ బ్యానర్‌పై నిర్మాత బాలు చరణ్ తెలుగులో రిలీజ్ చేశారు. తమిళ నటుడు అరుళ్ నిధి, ‘డిమాంటీ కాలనీ’ వంటి సినిమాల ద్వారా తన నటనా ప్రతిభను నిరూపించుకున్నాడు. ఈ సినిమాలోనూ అతని పెర్ఫార్మెన్స్ ఎంతో శక్తివంతంగా ఉంది. అతనికి జోడీగా ఐశ్వర్య రాజేశ్ నటించింది. ఇటీవల సంక్రాంతికి విడుదలైన “వస్తున్నాం” చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది ఐశ్వర్య. ఈ చిత్రంలో ఆమె చేసిన పాత్రను జీవితం పోసినట్టుగా చేశారు. ఆమె ఎమోషనల్ సీన్స్, స్ట్రాంగ్ క్యారెక్టర్ డెలివరీకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

అరివాజగన్ టేకింగ్ కిల్లర్! క్రైమ్ థ్రిల్లర్ లవర్స్‌కి మిస్ చేయలేని మూవీ

ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన అరివాజగన్ వెంకటాచలం స్క్రీన్‌ప్లే అద్భుతంగా చేసారు. కథను ముందుకు నడిపే విధానం, ప్రతి సన్నివేశంలో ఉత్కంఠను పెంచే టెక్నిక్‌‍లు సినిమాకి ఓ కొత్త లెవెల్ తీసుకువెళ్లాయి. ఓదార్పు, ఆవేదన, కోపం, నిరాశ.. ఇలా అన్ని భావోద్వేగాలను ఒకే కథలో అద్భుతంగా మిళితం చేశారు. దర్యాప్తు నేపథ్యంలో కథ సాగుతూ, చివరకు ఒక పెద్ద ట్విస్ట్‌తో ముగుస్తుంది. ఇదే ప్రధాన ఆకర్షణ. ఎవరూ ఊహించని మలుపులు ఈ చిత్రాన్ని వేరే లెవెల్లో నిలబెట్టాయి. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి ఇది వేసవిలో మిస్ కాకూడని బెస్ట్ ఆప్షన్.

ఈ వేసవిలో మిస్ అవ్వకండి – గరుడ 2.0 ఆహాలో ట్రెండింగ్ లో టాప్ 1!

ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న గరుడ 2.0, టాప్ 1 ప్లేస్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, గతంలో థియేటర్లలో విజయాన్ని సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ మీదా అదే మ్యాజిక్‌ని రిపీట్ చేస్తోంది. మంచి కథ, స్ట్రాంగ్ నటన, థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథనంతో గరుడ 2.0 ఓటీటీ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది.

read also: Chiranjeevi : జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా రి రిలీజ్ ఎప్పుడంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870