📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Die Hard Fan: విజయ్ని కలిసేందుకు వీరాభిమాని ఏం చేశాడో తెలుసా?

Author Icon By Anusha
Updated: April 27, 2025 • 1:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడులో తలపతి విజ‌య్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్క‌ర్లేదు. ఆయ‌న‌కి విప‌రీత‌మైన మాస్ ఫాలోయింగ్ ఉంది. విజ‌య్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అభిమానులు చేసే సంద‌డి మాములుగా ఉండదు. ఇక విజ‌య్ ఇప్పుడు రాజ‌కీయాల‌లోకి ఎంట్రీ ఇస్తుండ‌డంతో త‌మిళ రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి.ఆయన ఇప్పటికే ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. నటుడిగా ఆయనకు భారీ అభిమానులు ఉండటం వల్ల విజయ్ ఎక్కడికి వెళ్ళినా జనం గుంపులు గుంపులుగా వస్తున్నారు. కొందరైతే తమ అభిమాన హీరోలను కలవాలన్న కోరికత ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటుననారు.అయితే విజ‌య్‌కి తాజాగా అనూహ్య ఘ‌ట‌న ఎదురైంది. ర్యాలీ చేస్తున్న స‌మ‌యంలో ఓ అభిమాని ఒక్క‌సారిగా విజ‌య్ ర్యాలీ చేస్తున్న వాహ‌నంపైకి దూకాడు. ముందు షాక్ కి గురైన విజ‌య్ ఆ త‌ర్వాత అతనిని ద‌గ్గ‌ర‌కు తీసుకొని ఆప్యాయంగా పల‌క‌రించాడు.ఆ తర్వాత సదరు అభిమానికి పార్టీ కండువా కప్పి, శాంతింపజేసి అక్కడి నుంచి పంపించారు విజయ్. ఈ సంఘ‌ట‌న కోయంబ‌త్తూర్ ర్యాలీలో జ‌ర‌గ‌గా, ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

పార్టీ సిద్ధాంతాలు

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన వారు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. విజయ్ అభిమాని చేసిన ఈ చర్యను కొందరు నెటిజన్లు విమర్శించారు. ‘ఇదేం పిచ్చితనం ఈ అభిమానులకు ఏమైనా తెలివి ఉందా? ఇలాంటి మూర్ఖత్వాన్ని అసలు సహించకూడదు’ అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు.సినిమాల్లో సంచ‌ల‌నాలు సృష్టించిన విజ‌య్ ఇప్పుడు రాజ‌కీయాల‌లో స‌రికొత్త సునామి సృష్టించ‌బోతున్నాడ‌ని అభిమానులు చెప్పుకొస్తున్నారు. కొద్ది రోజుల క్రితం భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేసిన తమిళ హీరో విజయ్ తన పార్టీ సిద్ధాంతాలు ఏమిటో, ఎందుకోసం తాను రాజకీయాల్లోకి వచ్చానో ప్రజలకు తెలియ‌జెప్పారు. రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయం పూర్తి అవగాహనతో తీసుకున్నానన్న విజయ్ వెనకడుగు వేసే ప్రసక్తే లేద‌ని అన్నారు. ఏ టీమ్, బీ టీమ్ అనే తప్పుడు ప్రచారాలతో టీవీకే పార్టీని ఓడించలేరని ప్రత్యర్థుల విమర్శలకు దీటైన సమాధానం ఇచ్చారు.

రాజకీయం

హీరోగా కెరీర్ ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే దానిని వదిలేసి మీ కోసం, మిమ్మల్ని నమ్మి మీ విజయ్‌గా మీ ముందు నిలుచున్నానంటూ అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రకటించారు. రాజకీయాల్లో చిన్నపిల్లాడిని అని కొంతమంది అంటున్నారని,చిన్నపిల్లాడిని అయినా రాజకీయం అనే పాముతో ఆడుకునే పిల్లాడినని, దేనికీ భయపడనంటూ విజ‌య్ త‌న శైలిలో స్ప‌ష్టం చేశారు.తనను సినిమా ఆర్టిస్ట్ అని కొంద‌రు అంటుంటారు.తమిళనాట ఎంజీఆర్, ఏపీలో ఎన్టీఆర్ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన సంగతిని ఆ సంద‌ర్భంగా గుర్తు చేశారు విజ‌య్.

Read Also: Cinema News: సినిమా సక్సెస్ అవ్వాలని తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ హీరో ఎవరంటే!

#CoimbatoreRally #TamilPolitics #Vijay #VijayFans #ViralVideo Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.