📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Disha Patani :ప్రభాస్ సరసన నటించనున్నదిశా పటానీ

Author Icon By Anusha
Updated: April 1, 2025 • 5:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్, తన అభిమానులకు నెక్స్ట్ బిగ్గెస్ట్ హిట్‌ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. అందులో ఒకటి, హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిస్తున్న ఫౌజీ సినిమా. ఈ సినిమా కూడా ప్రేక్షకులు ఆతృత గా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం అఫీషియల్ పూజా కార్యక్రమంతో లాంచ్ అయింది. ఫౌజీ 1940ల కాలంలో సాగే వార్ బ్యాక్‌డ్రాప్‌ లో పీరియాడిక్ డ్రామా లవ్ స్టోరీగా రూపొందుతోందని సమాచారం. చారిత్రక అంశాలతో ముడిపడి ఉన్న ఫిక్షనల్ కథాంశం ఈ సినిమాకు ప్రత్యేకతను ఇస్తోంది. ఇందులో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది.

కీలక పాత్ర

ఈ సినిమాలో హీరోయిన్‌గా కొత్త అమ్మాయి ఇమాన్వి నటిస్తోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ అయిన యువ కథానాయిక. ఫౌజీ లాంచ్ సమయంలో ఈమెను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇమాన్వి తోపాటు మరొక బాలీవుడ్ సుందరి కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారట. సినీ వర్గాల్లో టాక్ ఉన్నదేమిటంటే, దర్శకుడు హను రాఘవపూడి, ఈ పాత్ర కోసం బాలీవుడ్ నటీమణి దిశా పఠానీని కూడా తీసుకోవాలనుకుంటున్నారని. అయితే ఈ విషయంపై చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు.

సినిమా

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ పాన్‌ ఇండియా సినిమాను నిర్మిస్తోంది. ఆధిపత్యం కోసం యుద్ధాలు జరుగుతున్న సమయంలో ఒక యోధుడు పోరాటానికి కొత్త అర్థం చెప్పాడు- అదేంటన్నదే ఈ చిత్ర ఇతివృత్తం అని చిత్ర వర్గాల టాక్. చిత్రంలో ప్రభాస్​తో పాటు మిథున్‌ చక్రవర్తి, జయప్రద తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు విశాల్‌ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. కూర్పు – కోటగిరి వెంకటేశ్వరరావు, ప్రొడక్షన్‌ డిజైనర్‌ – రామకృష్ణ, మోనిక, ఛాయాగ్రహణం – సుదీప్‌ ఛటర్జీ అందిస్తున్నారు.

ఆఫర్స్

ఇప్పటికే ప్రభాస్ తో కలిసి ఓ సినిమాలో నటించి మెప్పించింది దిశా పటానీ. కొన్నాళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న ఈఅమ్మడుకు ఇప్పుడు ప్రభాస్ సరసన వరుస ఆఫర్స్ వస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా దిశా పేరు మారుమోగుతుంది.మోడలింగ్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన దిశా పటానీ మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని హైలెట్ అయ్యింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ సరసన లోఫర్ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. కానీ ఈ సినిమా ప్లాప్ కావడంతో ఆమె బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది.

కల్కి

నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి చిత్రంలో ప్రభాస్ జోడిగా కనిపించింది. ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్లో మరోసారి పాపులర్ అయ్యింది.

#DishaPatani #HistoricalFiction #Imanvi #MaitriMovieMakers #PeriodDrama #Tollywood #WarMovie Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.