हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Sreenidhi Shetty: హిట్ 3 సినిమా కోసం తెలుగు నేర్చుకున్నా : శ్రీనిధి శెట్టి

Anusha
Sreenidhi Shetty: హిట్ 3 సినిమా కోసం తెలుగు నేర్చుకున్నా : శ్రీనిధి శెట్టి

టాలీవుడ్ హీరో నాని, ‘కేజీఎఫ్’ ఫేమ్ నటి ‘శ్రీనిధి శెట్టి’ జంటగా నటించిన ‘హిట్ 3’ చిత్రం మే 1వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన సినిమా ఇది. ప్రస్తుతం ఈ చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. ఈ సందర్భంగా నాని, శ్రీనిధి శెట్టి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను, తమ అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.టాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పుడు మొదట్లో కొంత ఆందోళన చెందానని, అయితే నేచురల్ స్టార్ నానితో కలిసి పనిచేయడం ప్రారంభించాక ఆ వాతావరణం ఎంతో సౌకర్యవంతంగా మారిందని కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి తెలిపారు. తెలుగు భాషను నేర్చుకోవడం గురించి మాట్లాడుతూ, 70 శాతం భాషపై పట్టుసాధించానని అనుకుంటున్నాననీ తెలుగు శబ్దాలు, సంభాషణలు వినడానికి చాలా బాగున్నాయని అన్నారు. నాని, చిత్ర బృందం సహాయంతో వేగంగా తెలుగు నేర్చుకోగలిగానని వివరించారు.

ప్రతిభ

నానీ మాట్లాడుతూ శ్రీనిధి అంకితభావాన్ని, భాషను వేగంగా నేర్చుకుంటున్న తీరును ప్రశంసించారు. ఆమె ఉత్సాహం, సెట్‌కు కొత్త ఉత్తేజాన్ని తీసుకువచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రానికి ప్రధానంగా నటుడిగానే తన బాధ్యత నిర్వర్తించానని స్పష్టం చేశారు. సాధారణంగా తాను కథతో మమేకమై ప్రయాణించడానికి ఇష్టపడతాననీ, కానీ ఈ సినిమా విషయంలో దర్శకుడి ప్రతిభపై పూర్తి నమ్మకం ఉంచి నటనపైనే దృష్టి సారించానని చెప్పారు. మిక్కీ జె మేయర్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  

 Sreenidhi Shetty: హిట్ 3 సినిమా కోసం తెలుగు నేర్చుకున్నా : శ్రీనిధి శెట్టి

సోష‌ల్ మీడియా

సినిమా విడుద‌ల కాగానే రివ్యూలు ఎందుకు అని ఈ మ‌ధ్య అంటున్నారు. దీనిపై మీ స్పంద‌న ఏంటి అని అడుగ‌గా నాని మాట్లాడుతూ సినిమాల‌కు రివ్యూలు ఇచ్చేవారు ఒకరోజు ఆగ‌మ‌ని చిత్రయూనిట్‌లు చెబుతున్నాయి. వాళ్లు ఎందుకు ఆగుతారు. దీనిని ఒక్క‌రోజు లాగ‌వ‌చ్చు లేదా రెండు రోజులు లాగ‌వ‌చ్చు కానీ చెప్పాల్సింది మాత్రం ఆపరు. ఇంత‌కుముందు అంటే సోష‌ల్ మీడియా లాంటివి లేవు. కానీ ఇప్పుడు ఏం చేసినా తెలుస్తుంది.అని చెప్పారు.సోషల్ మీడియా లేని రోజుల్లోనే సినిమాలకు సమీక్షలు ఇవ్వడం మొదలైంది. ఒకప్పుడు సినిమా రిలీజైన తర్వాత వార్తా పత్రికల్లో, మంత్లీ మ్యాగజైన్స్ లో రివ్యూలు రాసేవారు. రాను రాను విడుదలైన మరుసటి రోజు న్యూస్ పేపర్స్ లో రివ్యూలు రాయడం ప్రారంభించారు. ఇబ్బడిముబ్బడిగా టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత, రివ్యూలకు వీడియో రూపం వచ్చింది. 

Read Also: Pahalgam: పహల్గాం ఉగ్రదాడి స్పందించిన ఆలియా భట్,జాన్వీ కపూర్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870