📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Dhanush: ఇడ్లీ కడై మూవీ షూటింగ్ పూర్తీ చేసిన ధనుష్

Author Icon By Anusha
Updated: April 26, 2025 • 3:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ధనుష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ఇడ్లీ కడై ,నిత్యా మీనన్, ధనుష్ మళ్లీ హిట్టు కొట్టేందుకు ఇడ్లీ కడై అంటూ రాబోతోన్నారు. ఈ మూవీని ధనుష్ కాస్త స్లోగానే చేసినట్టుగా అనిపిస్తుంది. ఈ మూవీ మధ్యలో ఉండగానే జాబిలమ్మ నీకు అంత కోపమా ప్రాజెక్టుని ఫినిష్ చేశాడు. మళ్లీ ఇడ్లీ కడై సెట్‌లోకి వచ్చాడు. తిరు చిత్రం తరువాత మళ్లీ ధనుష్, నిత్యా మీనన్ కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ అవ్వడంతో అందరిలోనూ అంచనాలు పెరిగాయి. ఇక ఇది కూడా ఓ సెన్సిబుల్ స్టోరీ అని తెలుస్తోంది.నిత్యా మీనన్ అయితే ఇడ్లీ కడై గురించి చాలా గొప్పగానే చెబుతోంది. ఇంత వరకు తాను పోషించనటు వంటి, కనిపించనటు వంటి పాత్రను చేస్తున్నానని చెప్పింది. తన పాత్రను చూసి అంతా సర్ ప్రైజ్ అవుతారని కూడా చెప్పింది. మరి ఈ సారి కూడా జాతీయ అవార్డు వస్తుందా? అని అడిగితే ఏమో చెప్పలేం అని నవ్వేసింది. తిరుచిత్రాంబలం సినిమాలో నిత్యా మీనన్ నటనకు గానూ ఉత్తమ జాతీయ నటిగా అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.

కోలీవుడ్‌

ఇప్పుడు ధనుష్ ఇడ్లీ కడై షూటింగ్‌ను ఫినిష్ చేశాడు. ఇక చివరి రోజు షూటింగ్ కావడంతో ఇలా టీంతో కలిసి స్టిల్‌కు పోజు ఇచ్చాడు ధనుష్. ఈ మూవీని ధనుష్ తన స్టైల్ ఆఫ్ మేకింగ్‌కి కాస్త డిఫరెంట్‌గా తీశాడని అంటున్నారు. ఇడ్లీ కడై తరువాత ధనుష్ మరి కొన్ని ప్రాజెక్టుల్ని లైన్లో పెట్టుకున్నాడని అంటున్నారు. ఈసారి మళ్లీ వెట్రిమారన్‌తో మూవీ ఉంటుందని కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.ధనుష్ చివరగా దర్శకత్వం వహించి నటించిన రాయన్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కోలీవుడ్‌లో ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇది రివేంజ్ డ్రామా కాగా జాబిలమ్మ నీకు అంత కోపమా అంటూ జెన్ జీ లవ్ ట్రాకుల్ని తెరపైకి తీసుకు వచ్చాడు. అలా దర్శకత్వంలో ధనుష్ వెనువెంటనే వేరియేషన్స్ చూపించాడు. అటు రాయన్ మాస్, యాక్షన్, రివేంజ్ డ్రామాగా ఇటు ఓ యూత్ ఫుల్ లవ్ స్టోరీతో మెప్పించాడు ధనుష్. ఇక ఇప్పుడు ఇడ్లీ కడై అంటూ అక్టోబర్ 1న రాబోతోన్నాడు.

యూనిట్

అరుణ్ విజయ్, సత్యరాజ్, పార్తీబన్, షాలినీ పాండే, ప్రకాష్ రాజ్, సముద్రఖని, రాజ్‌కిరణ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తోన్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.తొలుత ఈ చిత్రాన్ని ఈ నెల 10వ తేదీన విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించినప్పటికీ- సాధ్యపడలేదు. షూటింగ్ పూర్తి కాకపోవడంతో విడుదల తేదీని మార్చారు.

Read Also: Shruti Hasan: (CSK) సీఎస్‌కే ఓటమి ఏడ్చేసిన శ్రుతి హాసన్ వీడియో వైరల్

#Dhanush #DhanushFans #IdlyKadai #IdlyKadaiShootWrap #ShootCompleted Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.