📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Devika & Danny: ‘దేవిక & డానీ’ (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ

Author Icon By Anusha
Updated: June 6, 2025 • 5:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్ హీరోయిన్ రీతూ వర్మ, శివ కందుకూరి, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘దేవిక & డానీ’ఈ రోజు నుంచి జియో హాట్ స్టార్(Jiohotstar) లో స్ట్రీమింగ్‌ అవుతోంది.7 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్ కోసం కొన్ని రోజులుగా ఫ్యామిలీ ఆడియన్స్ వెయిట్ చేస్తూ వస్తున్నారు. అలాంటి ప్రేక్షకులకు ఈ సిరీస్ ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం. 

కథఏంటంటే

దేవిక (రీతూ వర్మ) సంప్రదాయ బద్ధమైన కుటుంబానికి చెందిన యువతి. ఆంధ్రప్రదేశ్ లోని ఓ గ్రామీణ ప్రాంతంలో ఆమె కుటుంబం నివసిస్తూ ఉంటుంది. ఆమె తల్లి కౌసల్య (రజిత) తండ్రి స్వామినందన్ (శివన్నారాయణ). ఆమె తాతయ్య యోగి నందన్ (రామరాజు)కి కొన్ని శక్తులు ఉంటాయి. ఆయనకి చనిపోయినవారి ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. దేవిక ఒక స్కూల్లో మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. ప్రతిరోజూ బస్సులో ఆ స్కూల్ కి వెళ్లి వస్తూ ఉంటుంది.దేవికకి జగ్గీ (సుబ్బరాజు)తో నిశ్చితార్థం జరుగుతుంది. పెళ్లి ముహూర్తం 3 నెలల వరకూ లేకపోవడంతో, అప్పటివరకూ వెయిట్ చేయవలసి వస్తుంది. అయితే దేవిక జాతకం చూసిన ఓ జ్యోతిష్కుడు ఈ మూడు నెలలలో ఆమె మరొకరితో ప్రేమలోపడే అవకాశం ఉందని చెబుతాడు. ఆ మాట విన్న దగ్గర నుంచి దేవిక తండ్రి ఆందోళన చెందుతూనే ఉంటాడు. అయితే ఈ విషయాన్ని ఆయన తన మనసులోనే దాచుకుంటాడు.   

అన్యాయం

ఒక రోజున ఆమె దగ్గరికి డానీ (సూర్య వశిష్ఠ) వచ్చి పరిచయం చేసుకుంటాడు. తాను చూస్తున్నది అతని ఆత్మననీ, అతను చనిపోయి కొంతకాలమైందని తెలుసుకుని దేవిక షాక్ అవుతుంది. తన వలన ‘గాయత్రి’ కుటుంబానికి అన్యాయం జరిగిందనీ, ఆ తప్పును సరిదిద్దుకోవడానికి గాను తనకి సహకరించమని డానీ ఆత్మ కోరుతుంది. గాయత్రి ఎవరు? ఆమెకి డానీ చేసిన అన్యాయం ఎలాంటిది? జగ్గీతో నిశ్చితార్థం చేసుకున్న దేవిక, నిజంగానే వేరొకరితో లవ్ లో పడుతుందా? అనే అంశాలను కలుపుకుంటూ ఈ కథ ముందుకు వెళుతుంది. 

Devika & Danny

కథనం

రీతూ వర్మ ఇంతవరకూ చేసిన సినిమాలు, పాత్రలు కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆమెకి మంచి క్రేజ్ ఉంది. దానికి తోడు ‘దేవిక & డానీ’ ప్రమోషన్స్(Promotions) కారణంగా కూడా ఈ సిరీస్ అందరిలో ఆసక్తిని పెంచుతూ వచ్చింది. రీతూ వర్మ చేసింది అంటే, కంటెంట్ లో గట్టి పాయింట్ ఉండే ఉంటుందనే ఒక అంచనాకు రావడం సహజమే. మరి ఆ అంచనాలను ఈ సిరీస్ అందుకోగలిగిందా అంటే, లేదనే చెప్పాలి.’దేవిక & డానీ’ రెండూ ఇంగ్లిష్ లో ‘D’తో స్టార్ట్ కావొచ్చు. కానీ తెలుగులో రాయడానికి పలకడానికి కూడా మ్యాచ్ కాని పేర్లు ఇవి. దర్శకుడు ఎంచుకున్న లైన్ చెప్పాలనుకున్న పాయింట్ కొత్తవేమీ కాకపోయినప్పటికీ, మ్యాజిక్ చేయొచ్చు.కానీ ఆ స్థాయి ఆవిష్కరణ జరగలేదు. పాత్రలు, సన్నివేశాలు వెంటనే రియాక్ట్ కావు. నిదానంగా కదులుతూ ఉంటాయి. దేవిక – డానీ పాత్రల పరిచయం కృతకంగా మొదలు కావడంతోనే ప్రేక్షకులు నిరాశకి లోనవుతారు. 

విలేజ్ లొకేషన్స్

రామరాజు పాత్ర ఇంట్రడక్షన్ ఇంట్రెస్టింగ్ గా ఇచ్చారు. ఈ పాత్ర వైపు నుంచి ఆసక్తికరమైన అంశం ఏదో ఉందని ప్రేక్షకులు అనుకునేలోపు, అలాంటి ఆశలేమీ పెట్టుకోవద్దంటూ నీరు గార్చారు. శివ కందుకూరి(Shiva Kandukuri) పాత్ర విషయానికి వస్తే, చెప్పుకోదగినదేం కాదు. సుబ్బరాజు పాత్ర,ఆయన యాక్టింగ్ కొంతవరకూ హెల్ప్ అయ్యాయి. అలాగే అభినయశ్రీ, షణ్ముఖ్ రోల్స్ ను ఇంకాస్త  పవర్ఫుల్ గా డిజైన్ చేసి వాడుకోవడానికి అవకాశం ఉంది. ఒక మంచి పాత్ర కోసం కోవై సరళను తీసుకున్నారు గానీ, ఎమోషన్స్ వైపు నుంచి ఆమెను ఉపయోగించుకోలేకపోయారు. ఇన్నింటి మధ్య కాస్త ఉపశమనం కలిగించేవి ఏవైనా ఉన్నాయంటే, అవి విలేజ్ లొకేషన్స్ అనే చెప్పాలి.  

Read Also: Film Producer: ప్రేక్షకుల్ని థియేటర్ కి ఎలా రప్పించాలో ఆలోచించండి:బన్నీ వాసు

#DevikaAndDanny #DevikaDannyOnHotstar #RituVarma #ShivaKandukuri Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.