📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Deva Movie: వీక్షకుల మనసు దోచుకుంటున్న దేవా.. ఓటీటీలో హిట్ టాక్

Author Icon By Anusha
Updated: June 23, 2025 • 9:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల మిస్టరీ, థ్రిల్లర్ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా పెరిగింది. ఊహించని ట్విస్టులు, ఇంటెన్స్ సస్పెన్స్, భిన్నమైన కథలతో థ్రిల్లర్ చిత్రాలు ప్రేక్షకుల్ని థియేటర్‌ ఓటీటీ వేదికలవైపు మరింత ఆకర్షిస్తున్నాయి. అలాంటి కథాంశంతో 2025లో విడుదలైన తాజా చిత్రం ‘దేవా’ ఇప్పుడు ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రేక్షకుల్ని అలరిస్తూనే, చివర్లో ఊహించని ట్విస్ట్‌తో ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ఇందులో షాహిద్ కపూర్ (Shahid Kapoor) ప్రధాన పాత్ర పోషించారు, అలాగే పూజా హెగ్డే కథానాయికగా కనిపించింది. ఆయనతో పాటు, పావైల్ గులాటి, కుబ్రా సైట్, ప్రవేశ్ రాణా వంటి తారలు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ పోలీస్ ఆఫీసర్ దేవ్ పాత్రను పోషించారు.

కథేంటంటే

ఈ సినిమా కథ మొత్తం దేవ్ చుట్టూ తిరుగుతుంది. అతను ధైర్యవంతుడైన పోలీస్ ఆఫీసర్. పని విషయంలో అతను ఎవరి మాట వినడు. అతిపెద్ద గూండాలు, నేరస్థులు కూడా దేవ్ కి భయపడతారు. ఈ చిత్రంలో పావైల్ గులాటి (Pavail Gulati) ACP రోహన్ డి’సిల్వా పాత్రను పోషించారు. అయితే దేవా, రోహన్ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు. పోలీసుల కోసం నిర్వహించిన ఓ వేడుకలో రోహన్ హత్యకు గురవుతాడు. దీంతో కథ మలుపు తిరుగుతుంది. రోహన్ హత్య కేసును దర్యాప్తు ప్రారంభించి, హంతకుడిని కనుగొనడానికి ప్రయత్నిస్తాడు దేవా. అప్పుడే ఓ ప్రమాదంలో చిక్కుకుని జ్ఞాపకశక్తిని కోల్పోవడంతో సినిమా కథ మొత్తం తలక్రిందులవుతుంది.

Deva Movie:

అద్భుతమైన నటన

సినిమా చివరి వరకు విలన్ ఎవరనేది అర్థం కాదు. కానీ క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఈ చిత్రంలో మరోసారి అద్భుతమైన నటనతో జనాలను మెప్పించారు షాహిద్ కపూర్. ఈ చిత్రానికి రోషన్ ఆండ్రూస్ (Roshan Andrews) దర్శకత్వం వహించారు. రూ. 60 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 56.12 కోట్లు మాత్రమే వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ప్లిక్స్ (Netflix) ఓటీటీలో దూసుకుపోతుంది.

Read Also: Salman Khan : కపిల్ శర్మ షోలో సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

#DevaMovie #DevaOnOTT #Netflix #PoojaHegde #ShahidKapoor Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.