हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Actress: ‘స్పిరిట్’ మూవీ లో ప్రభాస్​కు జోడీగా దీపిక?

Anusha
Actress: ‘స్పిరిట్’ మూవీ లో ప్రభాస్​కు జోడీగా దీపిక?

టాలీవుడ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలో బిజీగా ఉన్నాడు. ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ చిత్రాలు ముగింపు దశలో ఉండగా త్వరలోనే ‘స్పిరిట్’ మొదలుకానుంది. ‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. దీనికి తగినట్లుగానే ఈ ప్రాజెక్టుపై రోజుకొక వార్త బయటకు వస్తోంది. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై చాలాకాలం క్రితమే ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయగా ‘యానిమల్’ తర్వాత సందీప్ ఫ్రీ అవ్వడంతో వెంటనే సెట్స్ మీదకు వెళ్తుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రభాస్ ప్రాధాన్యతా క్రమం మారుతూ వస్తుండటంతో వంగా సినిమా లేట్ అవుతూ వస్తోంది. ప్రస్తుతం ఇటలీలో రెస్ట్ తీసుకుంటోన్న ప్రభాస్ ఈ నెలలో హైదరాబాద్‌కు తిరిగొచ్చి ‘ది రాజా సాబ్’ షూటింగ్ ఫినిష్ చేయనున్నాడు. ఆ వెంటనే సందీప్ వంగా ‘స్పిరిట్’ స్టార్ట్ చేయనున్నాడు. ఈ ఏడాది సెకండాఫ్‌లో ‘ది రాజా సాబ్’ ప్రేక్షకుల ముందుకు రానుండగా ఆ తర్వాత లైన్లో ‘ఫౌజీ’ ఉంది. ఆ తర్వాత ‘కల్కి 2’, ‘సలార్ 2, ప్రశాంత్ వర్మతో సినిమాలు సెట్స్‌పైకి వెళ్లనున్నాయి.

ఆలస్యం

‘స్పిరిట్‌’ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త హల్‌చల్ చేస్తోంది. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణే పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం.సందీప్ రెడ్డి వంగా మూవీలో నటించాలని దీపికా మొదటి నుంచి ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అయితే గతేడాది చివర్లో స్పిరిట్ మూవీ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే పలు కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యం అయ్యింది. ఈ ఏడాది అక్టోబరులో షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్, దీపిక కలిసి ‘కల్కి 2898ఏడీ’లో నటించిన సంగతి తెలిసిందే. అలాగే ‘కల్కి 2’లోనూ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే తాజాగా ‘స్పిరిట్‌’లోనూ దీపికను తీసుకుంటే హైప్ క్రియేట్ అవుతుందని సందీప్ వంగా ఆలోచిస్తున్నాడట. ఇప్పటికే ఆమెను సంప్రదించడం, అగ్రిమెంట్ కూడా అయిపోవడం జరిగిందట. దీనిపై త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ‘అర్జున్ రెడ్డి’ మూవీకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్‌ ‘స్పిరిట్‌’కి పనిచేయనున్నట్లు తెలుస్తోంది.

 Actress: 'స్పిరిట్' మూవీ లో ప్రభాస్​కు జోడీగా దీపిక?

తొలిసారి

‘స్పిరిట్’లో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు ఇలాంటి కాప్ స్టోరీ రాలేదని సందీప్ చెబుతున్నాడు. దీంతో షూటింగ్ ప్రారంభం కాకముందే భారీ హైప్ క్రియేట్ అయిపోయింది. పైగా ప్రభాస్ కెరీర్లోనే తొలిసారి పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనుండటం ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు ‘స్పిరిట్’ మూవీ లేట్‌గా స్టార్ అవుతుందంటూ వస్తోన్న వార్తలపై నిర్మాత భూషణ్‌ కుమార్‌ క్లారిటీ ఇచ్చారు. ‘స్పిరిట్’ కంటే ముందుగా ‘యానిమల్‌ పార్క్’ వస్తుందనే వార్తలను ఆయన ఖండించారు. మరో రెండు, మూడు నెలల్లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుందని తెలిపారు. ‘స్పిరిట్’ మూవీని 2027లో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నామన్నారు.

Read Also: Movie: 2025లో బెస్ట్ సినిమా ఏదో తెలుసా?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870