📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Actress: అగ్గిపుల్ల అని కామెంట్స్‌ చేశారు: అనన్య పాండే

Author Icon By Anusha
Updated: May 18, 2025 • 12:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సినిమాల్లో కన్నా సోషల్‌ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తుంది బాలీవుడ్‌ బ్యూటీ .తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈ హీరోయిన్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కానీ తరచూ నెపోటిజం(Nepotism) విమర్శలను ఎదుర్కొంది. నెట్టింట ట్రోలింగ్ ను ఎదుర్కంది. అయితే అన్నిటికన్నా మరీ ముఖ్యంగా చిన్న వయసులోనే బాడీ షేమింగ్ బారిన పడిందీ అందాల తార. దీనికి తోడు ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ కావడంతో కొందరు ట్రోలర్లకు ఈ హీరోయిన్ టార్గెట్ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ హీరోయిన్ కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న అవమానాలు, చేదు అనుభవాలను గుర్తుకు చేసుకుంది. ‘నేను 18-19 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను. ఆ సమయంలో నేను చాలా సన్నగా ఉన్నాను. దీంతో చాలా మంది నా బాడీపై కామెంట్స్‌ చేశారు. కోడీ కాళ్లు అగ్గిపుల్లలా ఉన్నావంటూ నా శరీరంపై విమర్శలు చేసేవారు. నీ శరీరాకృతి సరిగ్గా లేదంటూ అసభ్యకరమైన కామెంట్స్‌ కూడా చేశారు. కానీ ఇప్పుడు నా శరీరం సహజంగానే మారుతుంటే ‘ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుంది’ అంటున్నారు. దీనిని బట్టే ఒక విషయం అర్థమైంది. మనం ఏ విధంగా ఉన్నా ఈ విమర్శలు, ట్రోలింగ్(Criticism, trolling) లు తప్పవు. వాటిని పట్టించుకోకుండా మన పని మనం చేసూకుంటూ పోతేనే విజయం సాధించగలం’ అని తనలాంటి వారిలో స్ఫూర్తి నింపింది అనన్య పాండే.

Actress: అగ్గిపుల్ల అని కామెంట్స్‌ చేశారు: అనన్య పాండే

ఆవేదన

ఇక మగవాళ్లపై బాడీ షేమింగ్‌ (Body shaming)విమర్శలు చాలా తక్కువగా ఉంటాయనీ, ఒకటో రెండో వచ్చినా వారిని అంతగా ఇబ్బంది పెట్టవని అంటున్నది. అదే, మహిళా నటులపై తరచుగా విమర్శలు గుప్పిస్తూనే ఉంటారనీ, వారిని ఎదగనీయకుండా అడ్డుకుంటారనీ ఆవేదన వ్యక్తం చేసింది. బాలీవుడ్‌ నటుడు చుంకీ పాండే కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చింది అనన్య. 2019లో వచ్చిన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ చిత్రం ద్వారా బాలీవుడ్‌ బాట పట్టింది. తొలి సినిమాలోనే తనదైన నటనతో అలరించింది.ఆ తర్వాత పతి పత్నీ ఔర్‌ వో, ఖాలీ పీలీ, రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ, డ్రీమ్‌ గర్ల్‌ 2, ఖో గయే హమ్‌ కహా లాంటి చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఇటీవలే అక్షయ్‌ కుమార్‌ సరసన కేసరి – చాప్టర్‌ 2లో కనిపించింది. ప్రస్తుతం లక్ష్య్‌ సరసన ‘చాంద్‌ మేరా దిల్‌’ కోసం సిద్ధమవుతున్నది అనన్య. ధర్మ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్‌ సోని దర్శకత్వం వహిస్తున్నాడు.

Read Also : Film Director:మనం ఫిలిం మేకర్స్ అని చెప్పుకోడానికే సిగ్గేస్తోంది:ఆర్జీవీ

#AnanyaPanday # #BollywoodBeautyStandards Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.