Chiranjeevi: ఫిబ్రవరి 11 నుంచి OTTలోకి ‘మన శంకర వరప్రసాద్ గారు’

Read Time:  1 min
Chiranjeevi
Chiranjeevi
FONT SIZE
GET APP

ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసిన సినిమా మన శంకర వర ప్రసాద్ గారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మాస్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలగలిపి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులను కొల్లగొడుతూ భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఈ సినిమా కలెక్షన్లు రూ.400 కోట్ల మార్క్ ను చేరినట్లు సమాచారం. 

Read Also: Mrunal Thakur: బ్రేకప్‌పై మృణాల్ షాకింగ్ కామెంట్స్..

Chiranjeevi
‘Our Shankar Varaprasad Garu’ will be available on OTT from February 11th.

ఈ నెల 11 నుంచి జీ 5 లో స్ట్రీమింగ్

తెలుగు సినిమాల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ‘మన శంకరవప్రసాద్ గారు’ (Mana Shankaravaprasad) రికార్డుల కెక్కింది. (Chiranjeevi) సినిమా విడుదలై మూడు వారాలు గడుస్తున్నా కలెక్షన్లు మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి షో నుంచే మంచి టాక్ వచ్చింది. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటించింది.

అతిథి పాత్రలో విక్టరీ వెంకటేశ్ కూడా ఈ సినిమాలో కనిపించారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ 5 సొంతం చేసుకుంది. ఈ నెల 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. థియేటర్లలో ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్‌మెంట్ అందించిన ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల్ని ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.