📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Singer: సింగర్ సోనూ నిగమ్ పై కేసు నమోదు

Author Icon By Anusha
Updated: May 6, 2025 • 3:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సింగర్ సోనూ నిగమ్ చిక్కుల్లో పడ్డాడు. బెంగళూరులో ఇటీవల జరిగిన ఓ సంగీత కచేరీలో సోనూ నిగమ్ వేదికపై పాటలు పాడుతుండగా ప్రేక్షకుల్లోంచి ఒక అభిమాని కన్నడలోనే పాట పాడాలని డిమాండ్ చేశాడు. అతడి తీరు పట్ల అసహనం వ్యక్తం చేసిన సోనూ నిగమ్ మధ్యలోనే పాటను ఆపేశాడు. అభిమాని బెదిరించినట్టుగా మాట్లాడటం తనను బాధించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు అన్ని భాషల పట్ల, ముఖ్యంగా కన్నడ భాష పట్ల గౌరవం ఉందని తెలిపాడు.డిమాండ్ చేసే ముందు ఎదురుగా ఎవరున్నారో కనీసం గమనించాలి’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. భాషను ఉద్దేశించి కాకుండా డిమాండ్ చేసిన తీరును విమర్శిస్తూ సోనూ ఈ వ్యాఖ్యలు చేసాడు.

ప్రేరేపించేలా

భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో బెంగళూరు పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ సంగీత విభావరిలో సోనూ నిగమ్ ప్రదర్శన ఇస్తుండగా, ఓ అభిమాని ప్రవర్తన కారణంగా వివాదం తలెత్తింది.ఈ సంఘటన అనంతరం, సోనూ నిగమ్ కన్నడ భాషను అవమానించేలా, భాషా విద్వేషాన్ని ప్రేరేపించేలా మాట్లాడారని ఆరోపిస్తూ ‘కర్ణాటక రక్షణ వేదిక – బెంగళూరు సిటీ యూనిట్’ అధ్యక్షుడు ధర్మరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.ధర్మరాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు, సోనూ నిగమ్‌కు నోటీసులు పంపారు. వారం రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదే సమయంలో, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఈ వివాదంపై స్పందించి, సోనూ నిగమ్‌పై తాత్కాలికంగా నిషేధం విధించినట్లు వార్తలు వస్తున్నాయి.

నిషేధం

ఈ వివాదంపై సోనూ నిగమ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చారు. “నిజాయతీగా చెప్పాలంటే, కర్ణాటక రాష్ట్రం, కన్నడ భాష, సంస్కృతి, కళాకారుల పట్ల నాకు అపారమైన ప్రేమ, గౌరవం ఉన్నాయి. నేను హిందీ పాటల కన్నా ఎక్కువగా కన్నడ పాటలనే ఆస్వాదిస్తాను. బెంగళూరులో ప్రదర్శనకు ముందు ఎక్కువ సమయం కన్నడ పాటల సాధనకే కేటాయిస్తాను” అని చెప్పారు.ఆ రోజు జరిగిన సంఘటన గురించి వివరిస్తూ, “నా వయసులో సగం కూడా లేని ఓ వ్యక్తి వేలాది మంది ముందు నన్ను అమర్యాదగా బెదిరించడం నన్నెంతో బాధించింది. ‘షో ఇప్పుడే మొదలైంది, ప్రణాళిక ప్రకారమే కొనసాగుతుంది’ అని అతనికి మర్యాదగానే సమాధానం ఇచ్చాను” అని తెలిపారు. సాంకేతిక కారణాలను కూడా ఆయన ప్రస్తావించారు. “కచేరీ కోసం ముందుగానే ఎంపిక చేసిన పాటల జాబితా ఉంటుంది. దాని ప్రకారమే గాయకులు, సాంకేతిక నిపుణులు సిద్ధంగా ఉంటారు. హఠాత్తుగా వేరే పాటలు పాడమని అడిగితే సాధ్యం కాదు, సాంకేతిక బృందం ఇబ్బంది పడుతుంది” అని వివరించారు.

Read Also : Varun Tej: అవును మేము తల్లితండ్రులం కాబోతున్నాం: వరుణ్,లావణ్య

#BengaluruConcert #Controversy #HateSpeechAllegations #IndianMusic #LanguageRow #PoliceNotice #SonuNigam Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.