📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Film Producer: థియేటర్ల పరిష్కారానికి 27 మందితో కమిటీ: సి.కల్యాణ్

Author Icon By Anusha
Updated: May 30, 2025 • 5:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విశాఖపట్నంలో సినీ రంగ ప్రముఖులు తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలపై చర్చించేందుకు శుక్రవారం సమావేశమయ్యారు. నగరంలోని దొండపర్తి(Dondaparthi)లో జరిగిన ఈ సమావేశంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. ఈ భేటీకి ప్రముఖ నిర్మాతలు స్రవంతి రవికిశోర్‌, సి.కల్యాణ్‌, సుధాకర్‌రెడ్డి, భరత్‌ భూషణ్‌ తదితరులు హాజరయ్యారు. సమావేశం అనంతరం నిర్మాత సి.కల్యాణ్‌ మీడియా ప్రతినిధులతో,సమావేశంలో మాట్లాడి, చర్చించిన అంశాలను మీడియా కు వివరించారు.సినిమా టికెట్ల ధరలు, థియేటర్ల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులు, పర్సంటేజీల విధానం వంటి ప్రధాన అంశాలపై ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించినట్లు సి.కల్యాణ్‌(C.Kalyan) తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.

ప్రభుత్వానికి

డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల సంఘాలకు చెందిన సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ప్రతి సంఘం నుంచి తొమ్మిది మంది చొప్పున మొత్తం 27 మంది సభ్యులతో ఈ కమిటీ(Committee) ఉంటుంది” అని సి.కల్యాణ్‌ పేర్కొన్నారు. కమిటీలో పాలుపంచుకునే సభ్యుల పేర్లను తొలుత ప్రభుత్వానికి తెలియజేస్తామని, అనంతరం సోమవారం నాడు కమిటీకి సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Film Producer: థియేటర్ల పరిష్కారానికి 27 మందితో కమిటీ: సి.కల్యాణ్

ఆశాభావం

ప్రస్తుతం పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, థియేటర్ల నిర్వహణ, పంపిణీలో పర్సంటేజీల విధానం వంటి అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్లు ఆయన పునరుద్ఘాటించారు. సినిమా హాళ్ల(Cinema halls)లో జరుగుతున్న తనిఖీల గురించి ప్రస్తావిస్తూ, అవి నిరంతర తనిఖీల్లో భాగంగానే జరుగుతున్నాయని, ఇందులో అసాధారణమేమీ లేదని అన్నారు. ప్రతి నెలా ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌(Executive Council) సమావేశం జరుగుతుందని కూడా కల్యాణ్‌ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కమిటీ ఏర్పాటుతో పరిశ్రమలోని పలు సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.

Read Also: Bhairavam Movie: భైరవం మూవీ రివ్యూ

#Distributors #Exhibitors #FilmIndustryUpdate #TollywoodCommittee Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.