📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Actress: చైనాలో తయారయ్యే వస్తువుల్ని కొనడం మానేయండి:రేణూ దేశాయ్

Author Icon By Anusha
Updated: May 16, 2025 • 10:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూ కాశ్మీర్ పహల్గాంలోజరిగిన ఉగ్రదాడి తదనంతర పరిణామాలు అందరికీ తెలిసినవే. ముఖ్యంగా పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రస్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మన బలగాలు దాడి చేయడం. తర్వాత ఇండియా-పాకిస్థాన్ మధ్య మూడు రోజుల పాటు టెన్షన్ టెన్షన్‌గా యుద్ధ వాతావరణం నెలకొంది. ఇక తర్వాత కాల్పుల విరమణతో పరిస్థితులు కుదుటపడ్డాయి. అయితే ఈ మొత్తం ఘటనపై పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతూనే ఉన్నారు.ముఖ్యంగా పాకిస్థాన్‌కి చైనా, టర్కీ లాంటి దేశాలు మద్దతు పలకడం భారత్‌తో పాటు పలు దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అంతేకాకుండా టర్కీకి వెళ్లే చాలా మంది భారతీయులు(Indians) తమ ప్రయాణాలు కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇలాంటి వేళ నటి రేణూ దేశాయ్(Renu Desai) అందరికీ ఓ సలహా ఇచ్చారు. దేశం పట్ల బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలంటూ కోరారు.మీరు నిజంగా మీ దేశం గురించి, మీ గురించి, మీ కుటుంబ భద్రత గురించి ఆలోచించేవాళ్లే అయితే ముందు ఓ పని చేయండి. చైనాలో తయారయ్యే చిన్న చిన్న వస్తువుల్ని కొనడం మానేయండి.ఏ వస్తువు కొన్నా దానిపై ఉన్న లేబుల్‌ని చదవండి. ఒకవేళ అవి చైనా వస్తువులు అయితే ఈ కారణంతోనే కొనడం లేదని షాపు యజమానులకి గట్టిగా చెప్పండి.

పరిష్కారం

అయితే నేను కూడా ఇప్పటివరకూ చైనాలో తయారైన చాలా వస్తువుల్ని కొన్నాను. కానీ ఇక నుంచి ప్రతి లేబుల్‌ని చెక్ చేసి చైనా వస్తువు అయితే నిషేధిస్తున్నాను. ఇక ముందు కూడా అలానే చేస్తాను. ఇది చాలా పెద్ద పనే కానీ ఎక్కడో ఒకచోట మొదలు కావాలి. కనుక మీరు కొనే ప్రతి వస్తువు ఎక్కడ తయారవుతుందనే లేబుల్‌ని ఖచ్చితంగా చదవండి.మన దేశానికి మద్దతు పలకండి, జై హింద్(Jai Hind)” అంటూ రేణూ పోస్ట్ చేశారు.అయినా ఇలాంటి పనులు ఎప్పుడో ఒకసారి మొదలు కావాలి మన దేశాన్ని మనమే సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు.ఈ పోస్ట్‌ని మీ స్నేహితులు, కుటుంబం అందరికీ షేర్ చేయండి.అందరూ చర్చించండి,ఆ పిచ్చి పిచ్చి రియాలిటీ టీవీ షోలు చూడటం మానేసి మన దేశం గురించి మాట్లాడండి” అంటూ ఈ పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చారు రేణూ.ఈ ఆలోచన బాగానే ఉంది కానీ అసలు చైనా వస్తువల్ని అందుబాటులో ఉంచకుండా చేస్తే సమస్యే ఉండదుగా అనేది నెటిజన్ల(Netizens) అభిప్రాయం. ఎందుకంటే చైనా నుంచి భారత్ ఎన్నో వస్తువుల్ని దిగుమతి చేసుకుంటుంది. అసలు భారత ప్రభుత్వం వాటిని బ్యాన్ చేసి చైనా నుంచి ఎలాంటి వస్తువులు దిగుమతి చేసుకోకుండా ఉండటం కదా అసలు పరిష్కారం అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అప్పుడే చైనాకి బుద్ధి వస్తుందని ఉగ్రదాడులకి, ఉగ్రవాదులకి మద్దతు పలికే, సాయం చేసే, తయారు చేసే పాకిస్థాన్ లాంటి దేశాలకి మద్దతు ఇవ్వడం ఆపుతుందని అంటున్నారు.

Read Also: Actor: తన వివాహ బంధాన్ని ఎందుకు వదులుకున్నాడో క్లారిటీ ఇచ్చిన జయం రవి

#BoycottChina #MadeInIndia #VocalForLocal Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.