Big Boss Ritu Chowdary : ‘నా భర్తతో బిగ్‌బాస్ రీతూ చౌదరి ఎఫైర్’.. సంచలన వీడియో బయట పెట్టిన హీరో భార్య ప్రసిద్ధ నటి, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ రీతూ చౌదరికి సంబంధించి కొన్ని ప్రైవేట్ వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. (Big Boss Ritu Chowdary) వీటిలో ఆమె ఒక టాలీవుడ్ కాంట్రవర్సీ హీరోతో కలిసి ఫ్లాట్‌లోకి వెళ్లడం, డ్రగ్స్ తీసుకుని తూలుతూ బయటకు రావడం వంటి సన్నివేశాలు కనిపిస్తున్నాయి, దీనిని చూసి అందరూ షాక్ అవుతున్నారు.
జబర్దస్త్ ఫేమ్, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ రీతూ చౌదరి మరోసారి వివాదాల్లో పడింది. ఆమెకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీటిని చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ గౌతమి ఈ వీడియోలను విడుదల చేసింది.
కొద్దిరోజుల క్రితం గౌతమి తన భర్త, టాలీవుడ్ హీరో ధర్మ మహేష్ వరకట్నం కోసం వేధిస్తున్నాడని, మరో అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో ఆమె ఆ యువతిని పేరు వెల్లడించలేదు, కానీ ఇప్పుడు కొన్నిఫొటోలు, వీడియోలు బయట పెట్టింది. వాటిలో బిగ్‌బాస్ ఫేమ్ రీతూ చౌదరి కనిపించడం, అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
తన భర్తతో రీతూ అనే అమ్మాయి రిలేషన్‌లో ఉందని అర్థమయ్యేలా ఫొటోలు, వీడియోలను గౌతమి బయట పెట్టింది.
ధర్మ మహేష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న గౌతమి 2023లో గర్భిణీగా ఉంది. అయితే అదే సమయంలో ఆమె భర్త రీతూ చౌదరితో సంబంధం పెట్టుకున్నాడని ఆమె ఆరోపించింది. గౌతమి కొన్ని సాక్ష్యాలను కూడా షేర్ చేసింది, ఇందులో రీతూ గురించి అడగడం వల్లే తనను భర్త దూరం పెడుతున్నాడని చూపిస్తుంది.
తదుపరి వీడియోల్లో రీతూ, ధర్మ మహేష్ కలిసి ఒక ఫ్లాట్‌లోకి వెళ్లడం కనిపిస్తుంది. అయితే వీరు నిజంగా రిలేషన్‌లో ఉన్నారా, లేదా కేవలం డ్రగ్స్ కోసం కలిసారు అనే చర్చ ఇప్పుడు నెట్టింట మొదలైంది.
ధర్మ మహేష్ విషయానికి వస్తే, సింధూరం, డ్రింకర్ సాయి సినిమాల్లో హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2019లో గౌతమిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2023లో వారికి బాబు జన్మించాడు. కొద్దిరోజుల క్రితం అదనపు కట్నం కోసం భర్త తనను వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గౌతమి సంచలన వీడియోలు బయట పెట్టింది.
ధర్మ మహేష్ భార్య బయట పెట్టిన సాక్ష్యాలు ఇవిగో…
Read also :