📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Bhairavam Movie: భైరవం మూవీ రివ్యూ

Author Icon By Anusha
Updated: May 30, 2025 • 3:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్ హీరోలు,మంచు మ‌నోజ్,బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్‌, నారా రోహిత్  ముగ్గురు హీరోల కలిసి ఓ సినిమా చేస్తున్నారంటే ఖచ్చితంగా సినిమాపై ఆస‌క్తి ఏర్పడుతుంది. మంచు మనోజ్ సినిమాలకు దూరమై దాదాపు 9 ఏళ్లు అవుతోంది.నారా రోహిత్ హిట్టు కొట్టి చాలా కాలం అవుతోంది. రాక్షసుడు తరువాత బెల్లంకొండ శ్రీనివాస్‌(Bellamkonda Srinivas)కి కూడా సరైన హిట్ పడలేదు. అలాంటి ఈ ముగ్గురు హీరోలు కలిసి ‘భైరవం’ అనే మూవీని చేశారు. తమిళ ‘గరుడాన్’ సినిమాకు విజయ్ కనకమేడల మార్పులు, చేర్పులు చేసి ‘భైరవం’గా మార్చారు. ఈ చిత్రం నేడు థియేటర్లోకి వచ్చింది.మరి ఈ హైప్‌కు తగిన విజయం లభించిందా లేదా అనేది ఇప్పుడు రివ్యూ లో తెలుసుకుందాం.

కథ ఏంటంటే

గ‌జ‌ప‌తివ‌ర్మ (మంచు మ‌నోజ్‌), వ‌ర‌ద (నారా రోహిత్‌) ఇద్దరూ మంచి మిత్రులు. వీరిద్దరి న‌మ్మిన బంటు శ్రీ‌ను (బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్). ఆ ఊర్లో వారాహీ అమ్మవారి గుడికి చెందిన భూముల మీద దేవాదాయ శాఖ మంత్రి (శరత్ లోహితస్య) క‌న్ను ప‌డుతుంది. ఈ కుట్ర ప్రాణ స్నేహితులైన గజపతి, వరద, శ్రీను మధ్య ఎలాంటి విభేదాలని తీసుకొస్తుంది? ఎలాంటి పంతానికి కారణం అవుతుంది? గజపతి భార్య నీలిమ (ఆనంది), వరద భార్య పూర్ణిమ (దివ్యా పిళ్లై), శ్రీను ప్రేమించిన అమ్మాయి వెన్నెల (అదితి శంకర్) ఈ కథలో ఎలాంటి పాత్రలు పోషించారు? అనేది మిగిలిన స్టోరీ.

Bhairavam Movie: భైరవం మూవీ రివ్యూ

కథనం

భైరవం సినిమా తమిళ చిత్రానికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. సూరి, శశి కుమార్, ఉన్ని ముకుందన్ కలిసి చేసిన ‘గరుడాన్’ మూవీని తెలుగులోకి విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) రీమేక్ చేశాడు. అక్కడ సూరి పోషించిన పాత్రను ఇక్కడ బెల్లంకొండ శ్రీను, శశి కుమార్ పోషించిన పాత్రను నారా రోహిత్, ఉన్ని ముకుందన్ చేసిన పాత్రను ఇక్కడ మనోజ్ పోషించారు. ఇక ఈ కథలో ఉన్ని ముకుందన్ కారెక్టర్‌లో ఎక్కువ షేడ్స్, ఎక్కువ విలనిజం ఉంటుంది.కానీ తెలుగులో వచ్చే సరికి ఆ స్థాయిని చాలా తగ్గించారు. మనోజ్(Manoj) ఇమేజ్‌కు తగ్గట్టుగా మార్చేశారు. అయితే ఈ విలనిజమే మనకు ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. మనోజ్ తనలోని నెగెటివ్ షేడ్స్‌ని, విలనిజాన్ని చక్కగానే పండించారు.అక్కడ సూరి పోషించిన పాత్రను ఇక్కడ బెల్లంకొండ శ్రీను పోషించాడు. అయితే ఈ పాత్రలోని సోల్ మాత్రం మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. ఒరిజినల్ పాత్రలో సూరీ తన యజమాని మీద ఈగ కూడా వాలనివ్వడు. ప్రాణమిత్రుడైనా సరే తన యజమాని మీద చేయిలేపినా, గొంతు ఎత్తినా అడ్డుకుంటాడు. కానీ ఇక్కడ తెలుగులో మాత్రం అలా ఉండదు. ఒకరి వైపు నిలబడకుండా ఇద్దరినీ బ్యాలెన్స్ చేసినట్టుగా ఆ క్యారెక్టర్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్‌ని కూడా కాస్త మార్చినట్టుగా కనిపిస్తుంది.

Read Also: Tollywood: వైజాగ్‌లో ప‌లువురు సినీ ప్ర‌ముఖుల భేటీ

#BellamkondaSaiSreenivas #Bhairavam #BhairavamMovie #BhairavamReview #TeluguCinema Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.